అటల్ బిహారీ వాజ్ పేయి ఆశయాలు దేశానికి మార్గదర్శకం

ఎడపల్లి , డిసెంబర్ 25 ( లోకంతీరు ) : భారత మాజీ ప్రధాని. భారతరత్న గ్రహీత అటల్ బిహారీ హాజ్ పెయి జయంతి సందర్భంగా బోధన్ పట్టణ బిజెపి శాఖ ఆధ్వర్యంలో గురువారం స్థానిక అంబేద్కర్ చౌరస్తా వద్ద ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. అనంతరం బోధన్ ప్రభుత్వ జిల్లా ఆసుపత్రిలో రోగులకు పండ్ల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా భారతీయ జనతా పార్టీ బోధన్ పట్టణ అధ్యక్షులు పసుపులేటి గోపి కిషన్ మాట్లాడుతూ. వాజ్ పేయి దేశ అభివృద్ధికి దీర్ఘకాలిక దృష్టితో విధానాలు అమలు చేసిన దర్శనిక నాయకుడని అన్నారు. గ్రామీణ సడక్ యోజన ద్వారా పల్లెల అభివృద్ధికి బాటలు వేసి. పోక్రాన్ అను పరీక్షలతో భారతదేశ సత్తాను ప్రపంచానికి చాటారని తెలిపారు. కార్గిల్ యుద్ధ విజయంతో దేశ గౌరవం మరింత పెరిగిందని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో నిజామాబాద్ జిల్లా ఉపాధ్యక్షులు కందగట్ల రామచందర్. మాజీ పట్టణ అధ్యక్షులు కోలిపాక బాలరాజు. మాజీ మున్సిపల్ ఫ్లోర్ లీడర్ మాసిని వినోద్. మండల అధ్యక్షులు సుదర్శన్. యువ మోర్చా అధ్యక్షులు ఏనుగంటి గౌతమ్ గౌడ్. అరవింద్. వాసు తదితర ప్రముఖులు పాల్గొన్నారు.ఎడపల్లి మండల కేంద్రంలో ఎడపల్లి భారతీయ జనతా పార్టీ ఎడపల్లి మండల శాఖ ఆధ్వర్యంలో శ్రీ అటల్ బిహార్ వాజ్ పేయి గారి జయంతి (సుపరిపాలన దినోత్సవం) కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఎడపల్లి స్థానిక సర్పంచ్ కందగట్ల రామచందర్ (అన్నా సెట్) వార్డు సభ్యులు వీరేందర్. దండు శంకర్. బర్దిపూర్ విట్టల్. బీజేవైఎం ఎడపల్లి మండల అధ్యక్షులు సాయి. భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులు నాయిని సతీష్ గౌడ్. లక్ష్మణ్ గౌడ్. కటుకం శంకర్. అనిరుద్. బూత్ అధ్యక్షులు కట్కం సుధాకర్. రాజేష్. రాజు. శ్రీను. బాలు. సాయి గుప్తా. గణేష్. కళ్యాణ్. శంకర్. భారతీయ జనతా పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.