36 వ డివిజన్ లో కాంగ్రెస్ జోష్

నిజామాబాద్ , ఫిబ్రవరి 05 ( లోకంతీరు ) : నిజామాబాద్ నగరంలో 36 వ డివిజన్ లో కాంగ్రెస్ ప్రచారం జోష్ కొనసాగుతుంది. ప్రతి అడుగు మీ తోనే ప్రతి మాట మీకోసమే అంటూ నినాదంతో ముందుకెళుతున్నారు విక్కీ యాదవ్. ప్రచారం లో మీ కష్టాలు వింటూ మీకు బరోసా కల్పించడమే కాకుండా పరిష్కరించే దిశగా అడుగులు వేయడమే నా బాధ్యత, లక్ష్యం. మీ కష్టాలు అవసరాలు నేను వింటున్నాను!! శాశ్వత పరిష్కారమే మార్గం . కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం మీకు అండగా ఉంటుందన్నారు. మీరు ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పక్షాన ఉండి చేతి గుర్తుకు ఓటు వేసి ఒక్కసారి ఆశీర్వదించాలని శ్రీ లత విక్కీ యాదవ్ 36 వ డివిజన్ ఓటర్లును కోరారు.