మైనార్టీ విద్యార్థులు విదేశాలలో ఉన్నత విద్యను అభ్యసించడానికి దరఖాస్తులు
– జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్

కామారెడ్డి జిల్లా ప్రతినిధి ,ఫిబ్రవరి 21 ( లోకంతీరు ) : తెలంగాణ రాష్ట్ర మైనార్టీ సంక్షేమ శాఖ ద్వారా విదేశాల్లో ఉన్నత విద్యను అభ్యసించాలనుకునే పేద మైనారిటీ ( ముస్లిం, క్రిస్టియన్, సిక్కు, జైన్, పార్శి) విద్యార్థులు సీఎం ఓవర్సీస్ స్కాలర్షిప్ పథకానికి దరఖాస్తు చేసుకోవాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ తెలిపారు.2023 సంవత్సరం (పాల్ సీజన్) ప్రవేశాలకు సంబంధించి విదేశీ విశ్వవిద్యాలయాలలో పోస్ట్ గ్రాడ్యుయేట్ లేదా డాక్ట రేట్ కోర్సులు చదివేందుకు స్కాలర్షిప్స్ లేదా ఫైనాన్షియల్ అసిస్టెంట్ మంజూరుకు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని చెప్పారు. అన్ని అర్హత ప్రమాణాలు కలిగి, విదేశీ విశ్వవిద్యాలయాలలో పోస్ట్ గ్రాడ్యుయేట్ లేదా డాక్టరేట్ కోర్సులలో తేదీ 01.08.2023 నుంచి 31.12.2023 లో పర్మిషన్ తీసుకున్న విద్యార్థులు ఆన్లైన్లో www.telanganaepass.cgg.gov.in ద్వారా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. వార్షిక ఆదాయం 5 లక్షల లోపు ఉండాలన్నారు. అర్హత గల విద్యార్థులు తేదీ 20.03.2024 సాయంత్రం 5 గంటలలోగా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. మరిన్ని వివరాలకు కలెక్టరేట్లోని రూమ్ నెంబర్.222లోని మైనార్టీ సంక్షేమ అధికారి కార్యాలయం నందు లేదా 8096973346 నెంబర్ ను సంప్రదించాలని కోరారు.