సి ఎం ఆర్ ఎఫ్ చెక్కు అందజేసిన మాజీ జడ్పిటిసి
కామారెడ్డి జిల్లా/ సదాశివనగర్, ఆగస్టు 29 ( లోకంతీరు ) : జిల్లాలోని సదాశివ నగర్ మండలం భూంపల్లి గ్రామానికి చెందిన వడ్ల లక్ష్మికి సిఎంఆర్ఎఫ్ కింద లక్ష రూపాయల చెక్కును మాజీ జెడ్పిటిసి పడిగెల రాజేశ్వరరావు గురువారం అందజేశారు. గురువారం కుటుంబ సభ్యులను పిలిచి చెక్కులు అందజేసారు. గత ప్రభుత్వంలో లక్ష రూపాయలు చెక్కు రాగా బాధితురాలు పేరు తప్పుగా రావడంతో తిరిగి చెక్కును ప్రభుత్వానికి అప్పగించి సరియైన పేరుతో హరీష్ రావు సహకారంతో చెక్కు తీసుకొచ్చి కుటుంబానికి అప్పగించారు. ఈ కార్యక్రమంలో రిటైర్ కండక్టర్ స్వామి, ఉద్యమకారుడు ముకుండు గారి దత్తు రావు, గైని కోటేశ్వర్ తదితరులు పాల్గొన్నారు.