Take a fresh look at your lifestyle.

ఎడపల్లి మండలంలో సర్పంచ్ లు , ఉప సర్పంచ్ లు , వార్డ్ నెంబర్లు ప్రమాణస్వీకారం….

0

ఎడపల్లి మండలంలో సర్పంచ్ లు , ఉప సర్పంచ్ లు , వార్డ్ నెంబర్లు ప్రమాణస్వీకారం

ఎడపల్లి, డిసెంబర్ 22 ( లోకంతీరు ) : ఎడపల్లి మండలంలో నూతనంగా ఎన్నికైన సర్పంచులు ఉప సర్పంచ్ వార్డు సభ్యులు అధికారికంగా గ్రామాలలోని గ్రామ ప్రత్యేకాధికారులచే ప్రమాణ స్వీకరణ పొందారు. గ్రామాభివృద్ధికి నిరంతరం పాటు పడతామని పంచాయతీ పాలకవర్గం సభ్యులుస్పష్టం చేశారు. ప్రజా పాలన కోసం పనిచేస్తామని గ్రామస్తులకు వారు హామీ ఇచ్చారు. ఎడపల్లిలో గ్రామపంచాయతీ సర్పంచ్ గా కందగట్ల రామచందర్, మంగళ్ పహాడ్ లో చేపూరి వీణ శ్రీనివాస్ గౌడ్, కున్నపల్లిలో పరిగె సాయిలు, తానాకాలన్ లో గంటే అలేఖ్య శ్రీనివాస్, జానకంపేటలో సుంచనకోట అనురాధ రాధా కిషన్ గౌడ్, నెహ్రు నగర్ లో ముస్కాన్ బేగం, పోచారంలో నీరడి జ్యోతి రవికుమార్, జైతాపూర్ లో రాజు గౌడ్, ఎంఎస్సీ ఫారంలో నోముల జయశ్రీ శ్రీనివాస్ గౌడ్, జమలంలో దొడ్డి శ్రీనివాస్, ధర్మారంలో సుండు కిషన్, వడ్డేపల్లిలో కుమ్మిటి సత్యం, బ్రాహ్మణపల్లి లో పురమళ్ళ హనుమంతు, ఏ ఆర్ పి క్యాంపులో వినోద్, అంబం ( వై) లో గోపరి స్రవంతి సుమన్ లు సర్పంచులుగా ప్రమాణ స్వీకరణ చేశారు. వీరితోపాటు ఉప సర్పంచ్ లు వార్డు సభ్యులు సైతం ప్రమాణ స్వీకరణ చేసిన వారిలో ఉన్నారు. అనంతరం స్థానిక అధికారులు, గ్రామ పెద్దలు యువకులు, మహిళలు నూతన పాలకవర్గానికి ఘనంగా సన్మానించి సత్కరించారు. ఈ సందర్భంగా సర్పంచులు మాట్లాడారు. గ్రామాభివృద్ధికి నిరంతరం పాటు పడతామని గ్రామస్తులకు హామీ ఇచ్చారు. కార్యక్రమంలో ఉప సర్పంచ్లు, పాలకవర్గం, అధికారులు అనధికారులు గ్రామ పెద్దలు, మహిళలు యువకులు తదితరులు పాల్గొన్నారు.

  • గ్రామ అభివృద్ధి ధ్యేయంగా కృషి చేస్తా…

  • సర్పంచ్ గెంటి అలేఖ్య శ్రీనివాస్

ఎడపల్లి మండలంలోని తానాకలాన్ గ్రామ అభివృద్ధి కొరకు నిరంతరం చేస్తానని సర్పంచ్ గెంటే అలేఖ్య శ్రీనివాస్ అన్నారు.సర్పంచ్ గా ప్రమాణ స్వీకరణ చేసిన అనంతరం మాట్లాడారు. ప్రజలు తనపై నమ్మకంతో ఎన్నుకున్నందున వారి నమ్మకాన్ని వమ్ము చేయకుండా ఐదేళ్ల పాలనలో గ్రామంలో వీధిలైట్లు, మంచినీటి సౌకర్యం ఏర్పాటు, సిసి డ్రైనేజీలు, సిసి రోడ్లు, నిర్మాణ పనులు చేసేందుకు పాలకవర్గం సహకారంతో మౌలిక సౌకర్యాల ఏర్పాటుకు కృషి చేస్తానన్నారు.గ్రామంలో నెలకొన్న సమస్యలను పరిష్కార దిశగా పనిచేస్తామని స్పష్టం చేశారు. అనంతరం సర్పంచ్ గెంటి అలేఖ్య శ్రీనివాస్ ను అధికారులు, నాయకులు, గ్రామ పెద్దలు, తదితరులు పూలమాలలతో సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు. ఎడపల్లి గ్రామపంచాయతీ సర్పంచ్ గా కందగట్ల రామచందర్, ఉప సర్పంచ్ గా మచ్కూరీగంగాధర్ వార్డ్ సభ్యులు ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం మండల భాజపా నాయకులు మల్లెపూల శ్రీనివాస్, చిట్యాల రాజేందర్, దెగ్లూర్ శంకర్, సుమన్, సుప్పాల భూషణం, బండ విట్టల్, సుంకర్ నరేష్, బండ అభిలాష్, బుడ్డ అబ్బయ్య, గంగా ప్రసాద్, అరుగుల నాగరాజ్, తదితరులు శాలువాలతో సన్మానించి శుభాకాంక్షలు తెలిపిన వారిలో ఉన్నారు.

Leave A Reply

Your email address will not be published.