Take a fresh look at your lifestyle.

ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఇద్దరు అధ్యాపకులకు డాక్టరేట్… సన్మానం..!

0

ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఇద్దరు అధ్యాపకులకు డాక్టరేట్… సన్మానం..!

ఎల్లారెడ్డి, డిసెంబర్ 12 ( లోకంతీరు) : ఎల్లారెడ్డి మండలంలోని ప్రభుత్వ మోడల్ డిగ్రీ కళాశాలలో వ్యాపార,వాణిజ్య శాస్త్రం,గణిత శాస్త్రం విభాగంలో పనిచేస్తున్న అధ్యాపకులు గంగారెడ్డి, సిద్దురాజులకు రాజస్థాన్ రాష్ట్రంలోని శ్రీ జగదీష్ ప్రసాద్ ఝాభార్మల్ తిబ్రేవాలా యూనివర్సిటీలో డాక్టరేట్ ప్రధానం చేసింది. గంగారెడ్డి తెలంగాణలోని హైదరాబాద్ ప్రాంతంపై నాలుగు చక్రాల వాహనాలు కొనుగోలు వినియోగదారులు ప్రవర్తన, సామర్థ్యంపై అధ్యయనం అనే అంశంపై, సిద్దు రాజు క్లౌడ్ కంప్యూటర్ వనరులు, డేటా బేస్ ల గణిత నమలపై అధ్యయనం అనే అంశంపై వారు నిర్వహించిన పరిశోధనకు గాను డాక్టరేట్ లభించినట్లు గంగారెడ్డి, సిద్దు రాజు తెలిపారు. సందర్భంగా గురువారం అధ్యాపకులు గంగారెడ్డి, సిద్దు రాజు లకు ప్రభుత్వ మోడల్ డిగ్రీ కళాశాలలో కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ లక్ష్మీనారాయణతో పాటు, అధ్యాపకులు శాలులతో సన్మానించి, అభినందనలు తెలిపారు.ఈ కార్యక్రమంలో అధ్యాపకులు తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.