దోపిడీలను కలసికట్టుగా అరికడుదాం
– నిజామాబాద్ ఎసిపి రాజా వెంకటరెడ్డి సూచన

నిజామాబాద్, జనవరి 22 ( లోకంతీరు ) : ఇటీవల నగరంతో పాటు జిల్లాలోని పలు ప్రాంతాల్లో దోపిడీ దొంగతనాలు పెరిగిపోతున్నతున్నందున బంగారు వర్తక వ్యాపారులు అప్రమత్తంగా ఉండాలని నిజామాబాద్ అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్(ఎసీపీ) ఎల్.రాజా వెంకటరెడ్డి సూచించారు. బుధవారం సాయంత్రం మార్వాడీ గల్లీ లోని భవన్ లోని నిజామాబాద్ గోల్డ్ అండ్ సిల్వర్ మార్చంట్ అసోసియేషన్ స్వర్ణ భవన్ లో అసోసియేషన్ సభ్యులతో అవగాహన సదస్సు నిర్వహించారు. సందర్భంగా ఏసీపీ రాజా వెంకట రెడ్డి మాట్లాడుతూ, దోపిడీ దొంగలు కొత్త టెక్నాలజీతో వినూత్న రీతిలో దోపిడీలకు పాల్పడుతున్నారని,వారి ఆగడాలకు చెక్ పెట్టేందుకు ఎప్పటికప్పుడు పోలీస్ యంత్రాంగం సరికొత్త సాంకేతిక టెక్నాలజీ ని ఉపయోగిస్తుంద దన్నారు. ప్రతి బంగారం shop లో కొత్తగా “అలారం ‘ పెట్టుకునాలని, వాటిని ప్రతి షాప్ వారికి మేము అందుబాటు ధర లో ఇప్పిస్తామన్నారు. అలాగే ప్రతి షాప్ లో సీ సీ కెమెరాలు పెట్టుకోవాలని ఎ ఎస్ పీ సూచించారు. సైబర్ నేరగాళ్లు తప్పుడు మొబైల్స్ తో మాటల్లో పెట్టి తికమక చేసీ డబ్బులు కొట్టేస్తున్నారని ఆయన పేర్కొన్నారు. ప్రతి బంగారు షాప్ యజమాని లేదా అసోసియేషన్ తరపున యూనిఫామ్ తో కూడిన నైట్ వాచ్ మెన్స్ ను పెట్టుకోవాలని, తాము నైట్ పెట్రోలింగ్ లో వారితో దోపిడీ దొంగల ఆటకట్టించేందుకు సమన్వయంతోచర్యలను తీసుకోవాల్సిన ఉంటుందని అవగాహన కల్పించారు. ఈ సమావేశంలో వన్ టౌన్ సీ ఐ రఘుపతి,అసోసియేషన్ అధ్యక్షుడు పాల్దే లక్ష్మి కాంతం, ప్రధాన కార్యదర్శి పసుల రాజ్ కుమార్ అసోసియేషన్ సభ్యులు పాల్గొన్నారు.