Take a fresh look at your lifestyle.

పంచాయతీ ఎన్నికల్లో గెలిచిన భాజపాఅభ్యర్థులకు ఘనంగా సన్మానం…..

0

పంచాయతీ ఎన్నికల్లో గెలిచిన భాజపాఅభ్యర్థులకు ఘనంగా సన్మానం

  • భాజపా రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మేడపాటి ప్రకాష్ రెడ్డి

ఎడపల్లి , డిసెంబర్ 15 ( లోకంతీరు )  : నిజామాబాద్ జిల్లా ఎడపల్లి మండలoలోని భారతీయ జనతా పార్టీ బలపరిచిన అభ్యర్థులు సర్పంచులుగా ఉపసర్పంచిగా వార్డ్ సభ్యులుగా గెలుపొందినందుకు సర్పంచ్ లతోపాటు ఉప సర్పంచ్ వార్డు సభ్యులను సోమవారం. ఎడపల్లి, తానాకలాన్ గ్రామ సర్పంచులు, వార్డు సభ్యులను సూర కిరణ్ ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మేడపాటి ప్రకాష్ రెడ్డి చేతుల మీదుగా నూతన ప్రజాప్రతినిధులను పూలమాలలు, శాలువాతో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా మేడపాటి ప్రకాష్ రెడ్డి మాట్లాడుతూ, నూతన సర్పంచులు ఉప సర్పంచులు వార్డ్ మెంబర్లు బాధ్యతాయుతంగా గ్రామాలలోని సమస్యలను పరిష్కరించే విధంగా పనిచేయాలన్నారు. గతంలో ఎన్నడూ లేనివిధంగా ఎడపల్లి మండల కేంద్రంలో భారతీయ జనతా పార్టీ జెండాను సర్పంచ్ గా ఎగురవేయడం చరిత్ర రాయడమేనని ఆయన స్పష్టం చేశారు. రానున్న స్థానిక సంస్థ గత ఎన్నికలలో సైతం భాజపా నాయకులు కార్యకర్తలు సైనికుల్లా పనిచేసే అభ్యర్థుల విజయానికి కృషి చేయాలని మేడపాటి ప్రకాశ్ రెడ్డి కోరారు. ఈ కార్యక్రమంలో బోధన్ నియోజకవర్గ భాజపా కన్వీనర్ శ్రీధర్ రెడ్డి, బోధన్ పట్టణ భారతీయ జనతా పార్టీ అధ్యక్షులు పసుపులోటి గోపి కిషన్. ఎడపల్లి మండల భాజపా అధ్యక్షులు కోల ఇంద్రకరణ్, భాజపా జిల్లా కార్యవర్గ సభ్యులు మల్లెపూల శ్రీనివాస్, తానాకలాన్ సర్పంచ్ గెంటే అలేఖ్య శ్రీనివాస్, ఉప సర్పంచ్ చింతల్ వారి రవి, భాజపా జిల్లా ఉపాధ్యక్షులు, ఎడపల్లి గ్రామ సర్పంచ్ కందగట్ల రామచందర్, వార్డు సభ్యులు అసది సాయిలు, మెట్టు శ్రీకాంత్, గుండ లక్ష్మి, మంగల్ పహాడ్ దేవెందర్, గెంటే కవిత, కాలంచ శ్రీకాంత్, అగుర్త వినోద్, గుండారం లక్ష్మి, టేకులపల్లి వినోద్, కమలాకర్, చిన్నరెడ్డి, బంజ గంగాధర్, గుండా శ్రీనివాస్, ఇసపల్లి గంగారం, సాయి కిరణ్, నిఖిల్, శషికాంత్ తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.