Take a fresh look at your lifestyle.

బెల్లంపల్లి లోని ఇండ్ల స్థలాల క్రమబద్ధీకరణ కు పట్టాలు ఇవ్వాలి….

0

బెల్లంపల్లి లోని ఇండ్ల స్థలాల క్రమబద్ధీకరణ కు పట్టాలు ఇవ్వాలి

  • జి.ఓ నెం:58,59 ప్రకారం డీ. డీ లు కట్టిన వారందిరికి వెంటనే న్యాయం చేయాలి 

 

ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా బ్యూరో చీఫ్, ఆగస్టు 29 ( లోకంతీరు ) : బెల్లంపల్లి పట్టణం లోని ఇండ్ల స్థలాలను క్రమబద్ధీకరించి , పట్టాలు ఇవ్వాలని , జి.ఓ నెం:58,59 ప్రకారం డీ. డీ లు కట్టిన వారందిరికి వెంటనే న్యాయం చేయాలని ఎంసీపిఐయూ పార్టీ జిల్లా సహాయ కార్యదర్శి పసుపులేటి వెంకటేష్ అన్నారు. శుక్రవారం రోజు బెల్లంపల్లి ఎంసీపిఐయూ పార్టీ కార్యాలయం లో ఏర్పాటు చేసిన సమావేశంలో అయన మాట్లాడుతూ బెల్లంపల్లి లో 1987లో మున్సిపాలిటీ ఆవిర్భవించి 38 సంవత్సరాలు కావస్తున్నా , ప్రభుత్వాలు మారినా పాలకులు మారినా బెల్లంపల్లి పరిస్థితి మాత్రం మారడం లేదన్నారు.గత ప్రభుత్వం పేదల కోసం ప్రవేశ పెట్టిన జి.ఓ నెం:58,59 ప్రకారం ఇండ్ల పట్టాలువస్తాయని ఆశతో అప్పు,సప్పు చేసి లక్షలాది రూపాయలు వెచ్చించి చెల్లించిన పైకం సామాన్యులకు తలకుమించిన భారంగా మారిందని,ఇండ్ల పట్టాల కోసం డీడీ లు కట్టిన వారందిరికి వెంటనే న్యాయం చేయాలన్నారు . లక్షలాది రూపాయలు వెచ్చించి ఇల్లు కట్టుకున్న కూడా ఇండ్లకు విలువ లేకుండా పోయిందన్నారు. బ్యాంకులకు వెళ్లి లోన్ తీసుకుందామంటే నయా పైసా కూడా ఇవ్వమని తెగేసి చెప్పే పరిస్థితి ఏర్పడిందని తెలిపారు. బెల్లంపల్లి పట్టణంలో గత బి ఆర్ ఎస్ పార్టీ ప్రభుత్వం హయాంలో చాలా మంది బ్యాంకు లలో డీ. డి ల పేరుతో కొన్ని లక్షల రూపాయలు కట్టి దశాబ్ద కాలంగా ఎదురుచూస్తున్న పరిస్థితి. కావున బెల్లంపల్లిలో ఉన్న ప్రజలకు న్యాయం చేయాలంటే జిల్లా ఉన్నతాధికారులు, కలెక్టర్, బెల్లంపల్లి నియోజకవర్గం ఎమ్మెల్యే గడ్డం వినోద్ స్పందించి, బెల్లంపల్లిలోని ఇండ్లకు పట్టాలు ఇప్పించి, బెల్లంపల్లి లో ఉన్న ఇండ్లకు యాజమాన్యపు హక్కు కల్పించాలని ఎంసీపిఐయూ పార్టీ డిమాండ్ చేస్తుందని తెలిపారు. లేనియెడల పార్టీలకతీతంగా బెల్లంపల్లి పట్టణ ప్రజలను కలుపుకొని ఉద్యమాలు ఉదృతం చేస్తామని హెచ్చరించారు.

Leave A Reply

Your email address will not be published.