ఎడపల్లిలో ఆశా వర్కర్లు అరెస్ట్
ఎడపల్లి, సెప్టెంబర్ 01 ( లోకంతీరు ) : సోమవారం అసెంబ్లీ ముట్టడి కార్యక్రమాన్ని నిర్ణయించుకోగా పోలీసులు ఆశా కార్యకర్తలను అరెస్టు చేసి పోలీస్ స్టేషన్ తరలించారు. ఎడపల్లి మండలం నుండి ఆశా కార్యకర్తలు పెద్ద ఎత్తున హైదరాబాద్ కు తరలి వెళ్తున్నారని సమాచారంతో ముందస్తుగాఎస్సై ముత్యాల రమా తెల్లవారుజామున ఆశా కార్యకర్తలు అరెస్ట్ చేశారు. వీరందరినీ ఎడపల్లి తానాలో ఉంచారు. తమను అరెస్ట్ చేయడం న్యాయం కాదని న్యాయమైన తమ డిమాండ్లు ప్రభుత్వాలు మారిన కార్యాచరణ రూపుదిద్దుకోవడం లేదని ఆశ వర్కర్ల యూనియన్ రాష్ట్ర ఉపాధ్యక్షురాలు రాజమణి డిమాండ్ చేశారు. పోలీసులు తమను అక్రమంగా అరెస్ట్ చేయడం తగలదని అన్నారు. కొద్దిసేపు పోలీస్ స్టేషన్ ఎదుట వారు బైఠాయించారు సొంత పూచికపై ఎడపల్లి పోలీసులు వారిని విడుదల చేశారు