Take a fresh look at your lifestyle.

దుబ్బ తండాలో కేంద్ర బృందం పర్యటన…..

0

దుబ్బ తండాలో కేంద్ర బృందం పర్యటన

ఎడపల్లి, సెప్టెంబర్ 02  ( లోకంతీరు ) : ఎడపల్లి మండలందుబ్బ తండా లో మంగళవారం కేంద్ర బృందం పర్యటించింది కేంద్ర ప్రభుత్వ పథకం(సుపోర్షక్) లో భాగంగా గ్రామంలోని పంచాయతీ కార్యాలయం తో పాటు అంగన్వాడి కేంద్రాన్ని పరిశీలించిన కేంద్ర బృందం..

అంగన్వాడి కేంద్రాన్ని కేంద్ర బృందం పరిశీలించింది. అంగన్వాడి కేంద్రాలలో పౌష్టికాహారం అందజేత, గర్భిణీ బాలింతలకు సక్రమంగా కేంద్రాలలో అందజేస్తున్నారు అన్న తీరిపై కేంద్ర బృందం పరిశీలించింది. పౌష్టికాహార లోపం ఉన్న పిల్లల ఎదుగుదల దానిని రికార్డులలో నమోదు వాస్తవంగా ఉన్నదానిని పరిశీలించారు. కేంద్రంలో ప్రీస్కూల్ అంశాలను నిర్వహిస్తున్నారని దానిపై పరిశీలన చేశారు. పిల్లలు ఎదుగుదల మానసిక వికాసానికి ఆట పాటల ద్వారా పిల్లలను ఆకట్టుకోవాలని సూచించారు. అంగన్వాడీ టీచర్ శారద పనితీరును ప్రశంసించారు. నిజామాబాద్ జిల్లాలో 8 గ్రామపంచాయతీలు ఎంపికయ్యాయని అందులో భాగంగానే మంగళవారం దుబ్బ తండాలో పర్యటించినట్లు కేంద్ర బృంద సభ్యులు తెలిపారుఈ కార్యక్రమంలో రాజస్థాన్ ఐ సి డి ఎస్ డిప్యూటీ డైరెక్టర్ ఓం ప్రకాష్, సహా ప్రతినిధులు రాజేష్, చంద్రకాంత్, జిల్లా బి డబ్ల్యు రసూల్ బి, సిడిపిఓ పద్మ, పర్యవేక్షకురాలు సావిత్రి, పౌష్టికాహార ఆన్లైన్ పర్యవేక్షకులు నరేష్ గ్రామస్తులు ఉన్నారు.

Leave A Reply

Your email address will not be published.