బోధన్ పట్టణంలోని హనుమాన్ వ్యాయమశాల వద్ద స్వచ్ఛభారత్ నిర్వహించిన బిజెపి

ఎడపల్లి, సెప్టెంబర్ 18 ( లోకంతీరు ) : ప్రధాని నరేంద్ర మోడీ గారి జన్మదినాన్ని పురస్కరించుకుని బిజెపి తెలంగాణ భారతీయ జనతా పార్టీ నిర్వహిస్తున్న సేవ పక్షం కార్యక్రమాల్లో భాగంగా ఈ రోజు గురువారం భారతీయ జనతా పార్టీ బోధన్ పట్టణ శాఖ ఆధ్వర్యంలో శక్కర్ నగర్ లోని హనుమాన్ వ్యాయామ శాల మరియు హనుమాన్ విగ్రహ పరిసర ప్రాంతంలో చెట్ల పొదలని శుభ్రం చేసి స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది, ఈ సందర్భంగా బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు అడ్లూరి శ్రీనివాస్ గారు,బోధన్ పట్టణ అధ్యక్షులు పసులోటి గోపీ కిషన్ మాట్లాడుతూ విశ్వ నాయకుడు భారత ప్రధాని నరేంద్ర మోడీ గారి జన్మదినం సందర్భంగా సెప్టెంబర్ 17 నుండి అక్టోబర్ 2 వరకూ రాష్ట్ర పార్టీ పిలుపు సేవ పక్షం కార్యక్రమాల్లో రక్తదాన శిబిరాలు, హెల్త్ క్యాంపులు,సేవ కార్యక్రమాల్లో భాగంగా బోధన్ పట్టణంలోని శక్కర్ నగర్ లోని హనుమాన్ వ్యాయామ శాల వద్ద స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది అని అన్నారు,ఈ కార్యక్రమాలు బోధన్ నియోజక వర్గంలోనీ అన్నీ మండలాల్లో కొనసాగుతున్నాయన్నారు , ఈ కార్యక్రమంలో బిజెపి మాజీ మున్సిపల్ ఫ్లోర్ లీడర్ మాసిని వినోద్ ( చిన్న) , మాజీ కౌన్సిలర్ గొడుగు ధర్మపురి, బిజెపి పట్టణ ప్రధాన కార్యదర్శి పవన్ కుమార్, సీనియర్ నాయకులు హన్మాండ్లు చారి, పెరుక వెంకటేష్, పట్టణ కార్యదర్శి శివరాజ్, స్వప్నిల్, కిషన్, పడాల శ్రీను, పుల్లెల్వార్డ్ రాజు, అనిల్ , గుడుముల శ్రీకాంత్, ఈశ్వర్, శ్రీనివాస్, అశోక్, కుషులు తదితరులు పాల్గొన్నారు.