ఘనంగా కాలభైరవ ముగింపు వేడుకలు
– ప్రత్యేక అతిథి ఎమ్మెల్యే మదన్మోహన్ రావు



రామారెడ్డి, నవంబర్ 13 ( లోకంతీరు ) : రామారెడ్డి మండల కేంద్రంలోని ఇసన్నపల్లి- రామారెడ్డి గ్రామాలలో వెలసిన అతి పురాతనమైన పవిత్రమైన మహా పుణ్యక్షేత్రం దక్షిణ కాశీగా వీరాజిల్లుతున్న ఏకైక క్షేత్రం శ్రీ కాలభైరవ స్వామి వారి జన్మదిన బ్రహ్మోత్సవాల ముగింపులో భాగంగా అంగరంగ వైభవంగా ఇరు గ్రామాలలో ప్రధాన వీధుల గుండా రథోత్సవం నిర్వహించారు.బ్రహ్మోత్సవాలలో స్థానిక ప్రజలే కాకుండా వివిధ జిల్లాల నుండి భారీ సంఖ్యలో భక్తులు స్వామివారి సేవకు పాత్రులయ్యారు.
ముఖ్య అతిథులుగా స్థానిక ఎమ్మెల్యే మదన్మోహన్ రావు మాట్లాడుతూ….!
శ్రీ కాలభైరవస్వామి ఆలయం అత్యంత పవిత్రమైనది, ప్రసిద్ధి గాంచినది. ఈ ఆలయాన్ని దక్షిణ కాశీగా అభివృద్ధి చేయడానికి నా వంతు కృషి చేస్తాను. ఈ మధ్యకాలంలో అసెంబ్లీలో కూడా ఆలయ అభివృద్ధి కొరకు ప్రస్తావించడం జరిగింది. ఈ క్షేత్రానికి ప్రముఖులు, సినీ తారలు, రాజకీయ నాయకులు, న్యాయమూర్తులు కూడా ఇక్కడకు వచ్చి స్వామివారి ఆశీస్సులు అందుకుంటారు.అని అన్నారు. నేను స్వయంగా రామారెడ్డి బిడ్డను నా చిన్ననాటి జ్ఞాపకాలు అంతా కలభైరవస్వామి ఆలయంతో ముడిపడి ఉన్నాయి.చిన్నప్పటి నుండి స్వామివారి ఉత్సవాలను చూస్తూ, వాటిలో పాల్గొంటూ పెరిగాను. ఈ ఆలయ అభివృద్ధి కోసం నా కృషి నిరంతరం కొనసాగుతుంది.అని ఎమ్మెల్యే మదన్ మోహన్ అన్నారు.స్వామివారిని అంగరంగ వైభవంగా రథంపై ఇరుగు గ్రామాలలోని ప్రధాన వీధుల గుండా ఊరేగింపు నిర్వహించారు. యువకులు, గ్రామస్తులు, భక్తులు, డప్పుల చప్పులు, డీజే సౌండ్ సిస్టంతో ప్రత్యేకంగా ఎమ్మెల్యే ఆలయం వరకు రథోత్సవ వేడుకలలో పాల్గొన్నారు. అంగరంగ వైభవంగా కన్నుల విందుగా అగ్నిగుండములు
జంగం ప్రభు స్వామి, జంగమ పంతులు,భక్తులు, అగ్నిగుండాలలో పాల్గొని అగ్నిపై నడిచారు.
అదేవిధంగా ఆలయానికి వచ్చే భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా అన్నదాన కార్యక్రమాన్ని ఆలయ సిబ్బంది వారు నిర్వహించారు.భారీ బందోబస్తు తో పోలీస్ సిబ్బందిని ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా వైద్య సేవలను కూడా ఆలయ ప్రాంగణంలో ఏర్పాటు చేశారు. ఆలయ అర్చకులు శ్రీనివాస్ శర్మ, వంశీకృష్ణ శర్మ, ఆలయ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ బుర్ల ప్రభురాంచంద్రం, జూనియర్ అసిస్టెంట్ సిహెచ్ లక్ష్మణ్, ఆఫీస్ సబార్డినేటర్ నాగరాజు,భారత్ స్వచ్ఛంద సేవకులు, విద్యుత్ సిబ్బంది.పలు గ్రామాల ప్రజలు నాయకులు తదితరులు పాల్గొన్నారు. మండల కాంగ్రెస్ నాయకులు మొగుళ్ల ప్రవీణ్ గౌడ్, ఏఎంసీ డైరెక్టర్ రావు ఫ్, గ్రామ కాంగ్రెస్ అధ్యక్షుడు నామాల రవి, కామారెడ్డి రవి గౌడ్, మండల యూత్ అధ్యక్షుడు పిప్పరి గణేష్,ఉప అధ్యక్షుడు అద్నాన్, కోఆర్డినేటర్ రంగు రవీందర్ గౌడ్, రాజేందర్ గౌడ్, నామాల శంకర్, గంగారాజాం గౌడ్, బండి ప్రవీణ్, అంబాయి ప్రసాద్, లేగల ప్రసాద్, తూర్పు రాజు, గంజి సతీష్ గుప్తా, పటిగల శ్రీనివాస్, గుర్జగుంట స్వామి, భాస్కర్ రెడ్డి, గొల్ల బైరయ్య యాదవ్, సిహెచ్ రాజు, లింగాపురం శంకర్,ఇసనపల్లి గ్రామ నాయకులు యువకులు, ఆయా గ్రామాల కాంగ్రెస్ కార్యకర్తలు, నాయకులు, ఆయా గ్రామాల మాజీ సర్పంచ్ లు, మాజీ ఎంపీటీసీలు,ముగింపు రోజు లో భాగంగా శాంతియుతంగా బ్రహ్మాండంగాబ్రహ్మోత్సవాలను ముగించారు.