గ్రామ పంచాయతీ స్థానిక ఎన్నికలను ప్రశాంతంగా నిర్వహించాలి
-
జిల్లా ఎన్నికల అబ్జర్వ ర్
-
జిల్లా అదనపు కలెక్టర్ శ్యాం ప్రసాద్ లాల్

ఎడపల్లి , డిసెంబర్ 11 ( లోకంతీరు ) : ఎడపల్లి మండలంలో నేడు జరుగుతున్న గ్రామపంచాయతీ ఎన్నికల సందర్భంగా ఎన్నికల సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని, ఎన్నికల జిల్లా అబ్జర్వార్, అదనపు కలెక్టర్ శ్యాం ప్రసాద్ లాల్ అధికారులను ఆదేశించారు. బుధవారం ఆయన ఎడపల్లి ఎంపీడీవో కార్యాలయ ఆవరణంలో ఏర్పాటు చేసిన అధికార సమీక్ష సమావేశం, ఎన్నికల నిర్వహణపై స్థానిక అధికారుల కువివరాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా అబ్జర్వర్ మాట్లాడారు. గ్రామీణ ప్రాంతాలలోని గ్రామపంచాయతీ ఎన్నికలను సమర్థవంతంగా ఎదుర్కోవాలన్నారు. ఏమైనా లోటు పాట్లు ఉంటే తమ దృష్టికి తీసుకురావాలన్నారు. ఆయన వెంట ఎడపల్లి ఎంపీడీవో శంకర్, తహసిల్దార్ దత్తాత్రేయ, మండల విద్యాశాఖ అధికారి శివలిం గాలప్ప, తదితరులు ఉన్నారు
-
పోలీస్ అధికారులు సిబ్బంది అప్రమత్తంగా ఉండాలి : ఎన్నికల
అబ్జర్వ ర్
నేడు జరుగుతున్న గ్రామపంచాయతీ ఎన్నికల్లో భాగంగా పోలింగ్ కేంద్రాల వద్ద పోలీస్ అధికారులు సిబ్బంది బందోబస్తుగా ఉండాలని ఎన్నికల జిల్లా అబ్జర్వర్, అదనపు కలెక్టర్ శ్యాం ప్రసాద్ లాల్ బోధన్ రూరల్ విజయ్ బాబుతో అన్నారు. పోలింగ్ అధికారులకు అందుబాటులో ఉండాలన్నారు. సమస్యాత్మక గ్రామాలపై ప్రత్యేక నిగా ఏర్పాటు చేయాలని సూచించారు. మొదటి విడత గ్రామపంచాయతీ పోలింగ్, కౌంటింగ్ విజయవంతం అయ్యేలా అధికారం అందరూ అప్రమత్తంగా ఉండాలన్నారు. -
పోలింగ్ కేంద్రాలకు ఎన్నికల సామర్థ్యం తీసుకెళ్తున్న అధికారులు సిబ్బంది
ఎడపల్లి మండలంలోని 17 గ్రామ పంచాయతీల సర్పంచ్ ఎన్నికల సందర్భంగా, బాపునగర్ గ్రామపంచాయతీ సర్పంచ్ వార్డు సభ్యులు ఏకగ్రీవమైనందున, బాపునగర్ మినహా మిగతా 16 గ్రామపంచాయతీ ఎన్నికల అధికారులకు మండల పరిషత్ కార్యాలయంలో ఎన్నికల సామాగ్ని మండల స్థాయి అధికారులు అందజేశారు. పోలింగ్ కేంద్రాలలో పోలింగ్ అధికారులతో పాటు అసిస్టెంట్ పోలింగ్ అధికారులు ఓటర్ల కు సంబంధించిన ఐడి కార్డులను తప్పనిసరిగా గుర్తుపట్టాలన్నారు.ఎలాంటి లోటు పాట్లకు తావులేకుండా విధులు నిర్వహించాలని అన్నారు. అవసరమైతే ఎన్నికలఅధికారులను సంప్రదించాలని తెలిపారు.
నేడు జరుగుతున్న గ్రామపంచాయతీ ఎన్నికల్లో భాగంగా పోలింగ్ కేంద్రాల వద్ద పోలీస్ అధికారులు సిబ్బంది బందోబస్తుగా ఉండాలని ఎన్నికల జిల్లా అబ్జర్వర్, అదనపు కలెక్టర్ శ్యాం ప్రసాద్ లాల్ బోధన్ రూరల్ విజయ్ బాబుతో అన్నారు. పోలింగ్ అధికారులకు అందుబాటులో ఉండాలన్నారు. సమస్యాత్మక గ్రామాలపై ప్రత్యేక నిగా ఏర్పాటు చేయాలని సూచించారు. మొదటి విడత గ్రామపంచాయతీ పోలింగ్, కౌంటింగ్ విజయవంతం అయ్యేలా అధికారం అందరూ అప్రమత్తంగా ఉండాలన్నారు.