SIR పై అవగాహన కల్పించిన భీంగల్ ఎమ్మార్వో యం.కిరణ్

నిజామాబాద్ / భీంగల్, జులై 13 ( లోకంతీరు న్యూస్ ) : ప్రత్యేక ఓటరు జాబితా సవరణ (SIR) ప్రక్రియపై ప్రజల్లో అవగాహన పెంపొందించేందుకు భీంగల్ మండల తహసీల్దార్ కిరణ్ కుమార్ ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఓటరు జాబితాలో పేర్లు నమోదు, మార్పులు, తొలగింపులు, చిరునామా సవరణలు వంటి అంశాలను నిర్ణీత గడువులోగా పూర్తి చేసుకోవాలని సూచించారు. అర్హత కలిగిన ప్రతి పౌరుడు తప్పనిసరిగా ఓటరుగా నమోదు చేసుకుని ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేయాలని పిలుపునిచ్చారు.SIR ప్రక్రియలో ప్రజలు ఎలాంటి అపోహలకు గురికాకుండా ఎన్నికల అధికారుల సూచనలు పాటించాలని, అవసరమైన పత్రాలను సమర్పించి సకాలంలో దరఖాస్తులు చేసుకోవాలని తెలిపారు. గ్రామ స్థాయి అధికారులు, బీఎల్‌వోలు ప్రజలకు పూర్తి సహకారం అందిస్తారని పేర్కొన్నారు.