ఆదిలాబాద్ జిల్లా లో 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు మొహమ్మద్ షబ్బీర్ అలీ

ఆదిలాబాద్ , ఆగష్టు 15 ( లోకంతీరు న్యూస్ ) : ఆదిలాబాద్ జిల్లా లో 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో ప్రభుత్వం తరపున ముఖ్య అతిధిగా పాల్గొన్న రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు మొహమ్మద్ అలీ షబ్బీర్ .షబ్బీర్ అలీకి గౌరవ వందనంతో స్వాగతం పలికిన పోలీస్ అధికారులు.పోలీస్ పరేడ్ గ్రౌండ్ లో 80వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్బంగా జెండా ఎగురావేసి.సంస్కృతి కార్యక్రమాలు వీక్షించి.ఉత్తమ ప్రతిభ కనబరిచిన ప్రభుత్వాధికారులకు ప్రశంస పత్రాలు అందించారు.అనంతరం ప్రసంగించి ప్రభుత్వం చేపడుతున్న పధకాలను రాబోయే కాలంలో చేపట్టే అభివృద్ధి కార్యక్రమాలను సవివరంగా వివరించారు.ఈ కార్యక్రమంలో ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్ రాజర్షి షా, జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్, ఎమ్మెల్యేలు అనిల్ జాదవ్ , పాయల్ శంకర్ , ఎంపీ నగేష్ , ఆదిలాబాద్ మున్సిపల్ చైర్మన్ అనూష , ప్రభుత్వ అధికారులు, ప్రజా ప్రతినిధులు, ప్రజలు పాల్గొన్నారు.