Take a fresh look at your lifestyle.

విడిసి అక్రమ కార్యకలాపాలను ఉక్కుపాదంతో అణచివేస్తాము….

0

విడిసి అక్రమ కార్యకలాపాలపై ఉక్కుపాదంతో అణచివేస్తాము….

  • పోలీస్ కమీషనర్ వెల్లడి..

నిజామాబాద్,  ఫిబ్రవరి 08 ( లోకంతీరు ) : గ్రామ అభివృద్ధి డెవలప్మెంట్ కమిటీ పేరుతో ఏర్పడిన (వి డి సి) ను పేద ప్రజలకు ఇబ్బంది పడేలా ఉంటే వారి కార్యకలాపాలకు ఉక్కు పాదంతో మోపి కేసులు పెడతామని నిజామాబాద్ కమిషనర్ హెచ్చరించారు. ఇప్పటి వరకు నిజామాబాద్ పోలీస్ కమీషనరేటు పరిధిలో గ్రామాభివృద్ది కమిటీల చట్టవ్యతిరేక కార్యకలాపాల పై గల కేసులు మరియు అరెస్టు అయిన వారి వివరాలు వెల్లడించారు.

2022 సంవత్సరంలో 12 కేసులు 119 మంది అరెస్ట్,
2023 సంవత్సరంలో 11 కేసులు 163 మంది అరెస్ట్,
2024 వ సంవత్సరంలో 05 కేసులు 75 మంది అరెస్ట్ ,

మొత్తం 28 కేసులు 357 మంది అరెస్ట్ చేశామన్నారు.

నిజామాబాద్ జిల్లాలో గ్రామాభివృద్ధి కమిటీలు గత 15 సంవత్సరాల నుండి కొన్ని గ్రామాలలో గ్రామాభివృద్ధి కోసం గ్రామభివృద్ది కమిటీల పేరుతో ఏర్పాటు చేసుకోవడం జరిగిందని, గ్రామాలలో గ్రామాభి- వృద్ది అవసరాలకు ప్రభుత్వం నుండి సహయం పొందకుండా తమ అవసరాలను తీర్చుకోవడం కోసం గ్రామాభివృద్ది కమిటీలను ఏర్పాటుచేసుకున్నారు. కాలక్రమేణ ఈ గ్రామాభివృద్ది కమిటీ పేరుతో అభివృద్ధి కార్యక్రమాలే కాకుండా గ్రామాలలో జరిగే సివిల్ తగాదాలు, భూ తగాదాలు, వివాహసంబంధ తగాదాలు, అన్నదమ్ముల పంచాయితీలు, భార్యభర్తల వివాదాలలో తలదూర్చీ, పంచాయితీలలో దడవాతు (అడ్వాన్సు) తీసుకొని వారికి నచ్చిన విధంగా తీర్మానించి, చట్టం చేయవలసిన పనిని వారి చేతులోనికి తీసుకొని, వాళ్ళను పోలీస్ స్టేషన్ ను, న్యాయస్థానాన్ని ఆశ్రయించకుండా గ్రామ ప్రజలలు తాము చెప్పినవిధంగా విననియెడల పెద్దమొత్తంలో దండుగా (జరిమానా ) వేసి మా మాట వినని వారిని ఆ గ్రామం నుండి వెలివేస్తాము అని భయబ్రాంతులకు గురిచేసి, గ్రామాభివృద్ది కమిటి పేరుతో గ్రామంలో బెల్టు షాపులు, కూల్డ్రింక్ షాపులు, కిరాణ షాపు మరియు కోడి గ్రుడ్డు ధర పై యాక్షన్ (వేలం వేయడం ) వేయడంలో ఎవరు ఎక్కువధర చెల్లిస్తారో ఆ వ్యక్తి మాత్రమే ఆ గ్రామంలో ఆ వస్తువులను అమ్మేటట్లు నియమముగా పెట్టి డబ్బులు వసూళ్ళు చేస్తున్నారన్నారు.

భారత రాజ్యాంగము కల్పించిన ఏ వృత్తియైన చేపట్టే ప్రాధమిక హక్కును ప్రతీ భారత పౌరునికి కల్పించింది. అలాగే పిసి ఆర్ Act 1955 (పౌర హక్కుల చట్టం 1955) ప్రకారంగా అనుసరించి పౌరుల కులం, మతంపరంగా కాని లేదా మరి ఏ విధంగానైనా కాని పౌరుల మద్యన పక్షపాతదోరని మరియు పౌరులను వర్గ మరియు కులపరంగా బహిష్కరించరాదన్నారు. రాష్ట్ర హైకోర్టు కూడా గ్రామాభి వృద్ది కమిటీలు నిర్వహిస్తున్న చట్టవ్యతిరేక కార్యకలాపాలపై కూడా తగుచర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేసారన్నారు. అలాగే జిల్లా న్యాయసేవా సంస్థ, గ్రామాభివృద్ది కమిటిల చట్టవ్యతిరేక కార్యకలాపాలు గురించి గ్రామాలలో అవగాహణ కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు. అయినా కూడా గ్రామాభివృద్ది కమిటీలు వారి పద్దతి మార్చుకోవడం లేదు. వారి చర్యల వలనుప్రజల హక్కులకు భంగము కల్పిస్తున్నాయి. ప్రజలకు సామాజికంగా వేరుచేయడమే కాకుండా ప్రజలకు జరిమానాలను వేస్తు ఆర్ధికముగా నష్టం చేస్తున్నారు.
భారత దేశంలో నివసించే ఏ వ్యక్తి అయిన భారత ప్రభుత్వం చట్టాలను గౌరవించి , ఆ చట్టాలకు లోబడే తమ కార్యకలాపాలు నిర్వహించాలన్నారు. ఎవ్వరికైన ఎలాంటి సమస్యలు వచ్చిన సంబంధిత శాఖలను సంప్రదించి ఆ శాఖ నుండి సహయసహకారాలు పొందాలని, కాని గ్రామాభివృద్ది కమిటి వారు వాళ్లు చెప్పిందే శాసనం అని, చట్టం అని చెప్పి ప్రజలను భయబ్రాంతులకు గురిచేసి తప్పుద్రోవ పట్టిస్తున్నారన్నారు.

ఎవ్వరికైనా ఈ గ్రామాభివృద్ది కమిటిల వలన ఎలాంటి ఇబ్బందులు వచ్చిన వారు తమ దగ్గరలోని పోలీస్ స్టేషన్ అధికారిని సంప్రదించగలరని కోరారు. కావున భవిష్యత్తులో ఎవ్వరయిని ఇలాంటి బహిష్కరణలు చేసినట్లయితే వారిపై చట్టరిత్య కఠినమైన చర్యలు తీసుకోబడును, ఎవ్వరిని కూడా ఉపేక్షించేది లేదు అని హెచ్చరించనైనది.

ఇట్టి విషయమై సంబంధిత పోలీస్ స్టేషన్ యందు సరియైన సమాధానం దొరకనట్లయితే తదుపరి అసిస్టెంటు కమీషనర్ ఆఫ్ పోలీస్ లేదా కమీషనర్ ఆఫ్ పోలీస్ లను సంప్రదించగలరన్నారు.

Leave A Reply

Your email address will not be published.