లోకంతీరు దినపత్రిక దినదిన అభివృద్ధి చెందాలి.. మంచి సందేశాత్మక కథనాలు ప్రచురించాలి.
లోకంతీరు దినపత్రిక క్యాలెండర్ ఆవిష్కరణలో….
– జిల్లా ఏ.సి.పి రాజా వెంకట రెడ్డి

నిజామాబాద్, జనవరి 24 ( లోకంతీరు ) : లోకం తీరు దినపత్రిక దిన దిన అభివృద్ధి చెందుతూ సమాజానికి ఉపయోగపడేలా మంచి సందేశాత్మక కథనాలను ప్రచురించాలని నిజామాబాద్ జిల్లా ఏ.సి.పి రాజా వెంకట రెడ్డి కోరారు . ఏ.సి.పి కార్యాలయంలో లోకం తీరు దినపత్రిక క్యాలెండర్ ను ఆయన ఆవిష్కరించారు .ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రస్తుతం ఎన్నో పత్రికలు వస్తున్నాయి. పత్రిక నడపడంలో ప్రచురించడంలో చాలా ఒడిదుడుకులు ఉంటాయని వాటన్నింటినీ భరించి పత్రికను ముందుకు తీసుకువెళ్లే బాధ్యత యజమానిదే కాకుండా అందరికీ ఉంటుందని అన్నారు . ప్రతి ఒక్కరూ మంచి మంచి కథనాలు రాస్తూ లోకంతీరు దినపత్రికకు మంచి పేరు తేవాలన్నారు.