సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాసంస్థల్లోని అక్రమాలపై చర్యలు తీసుకోవాలి
– అదనపు కలెక్టర్ గారికి PDSU వినతిపీ
– .డీ.ఎస్.యు.(PDSU) ఆధ్వర్యంలో

నిజామాబాదు, ఏప్రిల్ 07 ( లోకంతీరు ) : బాసర జోన్ 2 పరిధిలో నిజామాబాద్ జిల్లాలో కంజర మరియు ధర్మారం (B) పాఠశాలల్లో కంప్యూటర్ టీచర్ల (ICT) ల అక్రమ నియామకాలపై, జోనల్ ఆఫీస్ కేంద్రంగా డిప్యూటేషన్ లో వచ్చిన ఔట్సోర్సింగ్ డీఈవో (డాటా ఎంట్రీ ఆపరేటర్) రంజిత్ అవినీతిపై విచారణ చేపట్టాలని జిల్లా అదనపు కలెక్టర్ కిరణ్ కుమార్ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది.ఈ సందర్భంగా PDSU జిల్లా ప్రధాన కార్యదర్శి డాక్టర్ కర్క గణేష్ మాట్లాడుతూ*,గత నవంబర్ 2024 లో ఔట్ సోర్సింగ్ కంప్యూటర్ టీచర్ల డిప్యూటేషన్ రద్దయినా కూడా కంజర పాఠశాలలో కంప్యూటర్ టీచర్ (ICT) నాగరాజుని ఔట్ సోర్సింగ్ నుండి హానరోరియంలోకి మార్చి విద్యార్థులకు తీవ్రనష్టం చేస్తున్నారన్నారు. సంవత్సరం పైగా పాఠశాలకి గైర్హాజరు కావడం, వచ్చినా విద్యార్థులకు కంప్యూటర్ క్లాసులు బోధించకుండా, నిబంధనలను ఉల్లంఘిస్తూ సంవత్సరం తరువాత మళ్ళీ అదే పాఠశాలలో డిప్యూటేషన్ ఇవ్వడం జరిగిందన్నారు. డిప్యుటేషన్ అనుమతి ఇచ్చిన ప్రిన్సిపల్ పైన, అనుమతి ఇచ్చిన అధికారులపైన కూడా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల డిప్యూటేషన్ రద్దు అయినప్పటికీ నాగరాజును పనిచేసే పాఠశాలకు పంపించకుండా, మళ్లీ అదే కంజర పాఠశాలలో ICT నాగరాజు ని ఔట్ సోర్సింగ్ నుండి హానరోరియం కి మార్చి, నిబంధనలకు విరుద్ధంగా పనిచేయడానికి అనుమతి ఎందుకు ఇచ్చారన్నారు.
విద్యార్థులకు కంప్యూటర్ సబ్జెక్ట్ బోధించకుండా అక్రమంగా అక్కడ కొనసాగుతున్న వెంటనే విధుల నుండి బహిష్కరించాలని డిమాండ్ చేశారు. దీనికి సహకరించిన బాన్సువాడ గురుకుల పాఠశాల నుంచి డిప్యూటేషన్ లో జోనల్ ఆఫీస్ లో పనిచేస్తున్న డీఈఓ రంజిత్ ను విధులనుంచి తొలగించాలని, పూర్తి స్థాయిలో విచారణ చేపట్టాలని డిమాండ్ చేశారు.ఈ మధ్యకాలంలో గ్రూప్ 4 ఫలితాల తర్వాత గురుకుల విద్యాసంస్థల్లో జూనియర్ అసిస్టెంట్ల నియామకాలు చేపట్టడం జరిగిందని తెలిపారు. జోనల్ ఆఫీస్ ఉన్నటువంటి ధర్మారం (B) పాఠశాలలో కూడా కొత్త ఉద్యోగులు రావడం ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు ఆ పదవిలో నుంచి వెళ్లాల్సి రావడం సహజమే అయిన ఇన్చార్జి ప్రిన్సిపల్ గారు స్వలాభం కోసం అక్కడ ఉన్న అడిషనల్ డీఈవో ప్రవీణ్ ని కాపాడడం కోసం అక్కడే పనిచేస్తున్న కంప్యూటర్ టీచర్ (ICT పాఠశాలకి నాలుగు కిలోమీటర్ల దూరంలో తన నివాసం ఉన్నప్పటికీ) అపూర్వ మేడంని ఒక మహిళ అని కూడా చూడకుండా 90 కిలోమీటర్ల దూరంలో ఉన్న తాడ్కోల్ గురుకుల పాఠశాలకి పంపించడం అక్రమమైందన్నారు.
ఏ అక్రమాలు జరగకుండానే ఏ విధి విధానాలు లేకుండానే, అడిషనల్ డీఈఓ ప్రవీణ్ ని కంప్యూటర్ టీచర్ (ICT) గా మార్చడం సొసైటీ విలువలకే విరుద్ధమైనదిగా భావించి దానికి కారణమైన ప్రిన్సిపాల్ ని, అనుమతి ఇచ్చిన పై అధికారులను తక్షణమే విదుల నుంచి తొలగించాలని, దీని వెనుక ఉండి నడిపించిన డిప్యుటేషన్ లో జోనల్ ఆఫీస్ లో పనిచేస్తున్న ఔట్సోర్సింగ్ డిఈఓ రంజిత్ ని తక్షణమే విడుదల నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు. ఔట్ సోర్సింగ్ కంప్యూటర్ టీచర్ (ICT) ల డిప్యూటేషన్ రద్దు అయిన దాదాపు నెల తరువాత ధర్మారం (బి) ICT ప్రవీణ్ నియమకాన్ని చేయడం ఇంకా సొసైటీ నియమావళికి విరుద్ధమైనదిగా భావించి దానికి కారణమైన అందరిపై చర్యలు తీసుకుని వెంటనే ఉద్యోగం నుండి తొలగించాలని డిమాండ్ చేశారు.
జోనల్ ఆఫీసుల్లో గ్రూప్ 4 ఉద్యోగులను నియమించాలని, జోనల్ 2 ఆఫీస్ లో పనిచేసే డీఈఓ(డాటా ఎంట్రీ ఆపరేటర్) రంజిత్ వచ్చినప్పటినుండి ఇప్పటివరకు ప్రతిబిల్లుపై విచారణ చేపట్టాలని డిమాండ్ చేశారు. కంప్యూటర్ టీచర్లను విద్యార్థులకు పాఠాలు బోధించే విధంగా చర్యలు తీసుకోవాలని, పాఠాలు బోధించని కంప్యూటర్ టీచర్లను విధులనుండి తొలగించాలన్నారు. పాఠశాల విద్యార్థుల నుండి సమస్యలను తెలుసుకోవడానికి, ప్రతి పాఠశాలలో సజెషన్ బాక్స్‌లను ఏర్పాటు చేయాలి. ఈ కార్యక్రమంలో PDSU నాయకులు భాను ప్రియ, వినోద్ కుమార్ తదితరులు పాల్గొన్నారు