41వ డివిజన్ ప్రెసిడెంట్ షేక్ అహ్మద్ సమక్షంలో
తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా జెండా ఆవిష్కరణ

నిజామాబాద్, ఏప్రిల్ 27 ( లోకంతీరు ) : తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావమే లక్ష్యంగా ఏర్పడిన తెలంగాణ గుండె చప్పుడు అయినటువంటి బిఆర్ఎస్ పార్టీ 24 వసంతాలు పూర్తిచేసుకుని 25 వ సంవత్సరంలో అడుగు పెడుతున్న శుభ సందర్భంగా తెలంగాణ ఉద్యమ నాయకుడు తెలంగాణ కేసరి కెసిఆర్ వరంగల్ లో నిర్వహిస్తున్న భారీ బహిరంగ సభకు చంద్రశేఖర్ కాలనీ నుంచి తరలి వెళ్లడం జరుగుతుంది.తెలంగాణ ఉద్యమ స్ఫూర్తితో మళ్లీ దశ ఉద్యమాన్ని మొదలుపెట్టి తెలంగాణ రాష్ట్రంలో మళ్లీ అధికారంలోకి వచ్చి సంక్షేమ పథకాలు అమలు చేయడం జరుగుతుంది అని తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా జెండా ఆవిష్కరించిన 41 డివిజన్ ప్రెసిడెంట్ షేక్ అహ్మద్, ఈ కార్యక్రమంలో 41 డివిజన్ సెక్రెటరీ జింక అశోక్, కార్మిక విభాగం జిల్లా అధ్యక్షురాలు విజయలక్ష్మి , 39వ డివిజన్ అధ్యక్షుడు సిద్దు మరియు కాలనీ నాయకులు యాదగిరి జబ్బర్ తదితరులు పాల్గొన్నారు.