Take a fresh look at your lifestyle.

శ్రీ మాధవి పాఠశాలలో అంబరాన్నంటిన బతుకమ్మ సంబరాలు….

0

శ్రీ మాధవి పాఠశాలలో అంబరాన్నంటిన బతుకమ్మ సంబరాలు

– పూర్వ విద్యార్థి సీనయ్య బృందానికి సన్మానం…

 

ఎడపల్లి, సెప్టెంబర్ 20 ( లోకంతీరు ) : ఎడపల్లి మండల కేంద్రంలోని శ్రీ మాధవి పాఠశాలలో శనివారం బతుకమ్మ సంబరాలు అంబురానా అంటాయి. దసరాకు ,దేవి నవరాత్రి ఉత్సవాలకు ముందుగానే, ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలో బతుకమ్మ సంబరాలను పాఠశాల యాజమాన్యం, ఉపాధ్యాయులు ఘనంగా నిర్వహించారు. శ్రీ మాధవి పాఠశాలలో నిర్వహించిన బతుకమ్మ సంబరాల వేడుకల్లో చిన్నారి బాలబాలికులతో పాటు మహిళా ఉపాధ్యాయులు బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాల అంటూ సంబరాలతో వేడుకలను ఘనంగా జరుపుకున్నారు. ప్రతి సంవత్సరం బతుకమ్మ పండగ వేడుకలను తమ పాఠశాలలో జరుపుకుంటామని శ్రీ మాధవి పాఠశాల కరస్పాండెంట్, ప్రధానోపాధ్యాయులు, మల్లెపూల మాధవి సురేష్ గౌడ్ తెలిపారు. గౌరమ్మకు ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం స్థానిక చెరువులో భక్తిశ్రద్ధలతో నిమజ్జనం చేశారు. కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు మాధవి, కరస్పాండెంట్ మల్లెపూల సురేష్ గౌడ్, ఉపాధ్యాయులు, పాఠశాల బాల బాలికలు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

శ్రీ మాధవి పాఠశాలలో సీనయ్య బృందానికి సన్మానం

ఎడపల్లి మండల కేంద్రంలోని శ్రీ మాధవి పాఠశాలలో చదివిన పూర్వ విద్యార్థులు సీనయ్య గుండు నీదేనయ్యా అనే పాట గేయాన్ని ఆలపించి యావత్తు తెలంగాణ రాష్ట్రంలోనే మంచి పేరు ప్రతిష్టలు పొందిన, సంగం శ్రీనివాస్ (ఎడపల్లి), కమ్మరి వినోద్ (ఎడపల్లి), రాజేష్ బాబు, (బ్రాహ్మణపల్లి) బృందాన్నిశనివారం పాఠశాల ప్రధానోపాధ్యాయులు మల్లెపూల మాధవి, సురేష్ గౌడ్ ,ఉపాధ్యాయ బృందం ఘనంగా సత్కరించి జ్ఞాపికలన అందజేశారు. తమ పాఠశాలలో చదువుకున్న పూర్వ విద్యార్థులు ఈ స్థాయికి రావడం తమ పాఠశాలకు ఎంతో గర్వకారణం అని సురేష్ గౌడ్ అన్నారు.అనంతరం సీనయ్య గుండు నీదేనయ్యా సినీ ప్రేమ్ గాయకులు సంగేమ్ శ్రీనివాస్ బృందం మాట్లాడారు.తాము ఎడపల్లి మండల కేంద్రంలోని శ్రీ మాధవి పాఠశాలలో చదువుకొని తమను ఈ స్థాయికి తీసుకురావడంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఉపాధ్యాయుల సహకారము తాము మర్చిపోలేని ఆ బృందం పాఠశాల ఉపాధ్యాయులకు పాదాభివందనములు చేశారు. గురువులను మర్చిపోలేమనీ సంగేమ్ శ్రీ నివాస్ బృందం అన్నారు. తాము ఈ స్థాయిలో ఉన్నామంటే గురువులే తమకు దైవజ్ఞులు అన్నారు. అనంతరం పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థిని విద్యార్థులు, సీనయ్య గుండు నీదేనయ్య గాయకులైన సంగేమ్ శ్రీనివాస్,రాజేష్ బాబు,వినోద్ లతో ఫోటో పోటిన ఫోటోలు దిగారు. ఏది ఏమైనప్పటికీ సంగేమ్ శ్రీనివాస్ బృందం తన ఆనందాన్ని ఉపాధ్యాయులతో వ్యక్తపరచుకున్నారు. ఇలాంటి అవకాశం దొరకడం తమకు ఎంతో సంతోషాన్ని ఇచ్చిందని వాళ్లు ఉపాధ్యాయులకు నమస్కరించారు. కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులతో పాటు విద్యార్థిని విద్యార్థులు. పాఠశాల సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.