Take a fresh look at your lifestyle.

ఇందిరమ్మ ఇండ్ల కోసం స్థల పరిశీలన చేసిన ఎమ్మెల్యే భూపతిరెడ్డి…

0

ఇందిరమ్మ ఇండ్ల కోసం స్థల పరిశీలన చేసిన ఎమ్మెల్యే భూపతిరెడ్డి

ఇందల్వాయి/గన్నారం, అక్టోబర్ 31 ( లోకంతీరు ) : ఇందిరమ్మ ఇండ్ల పథకం కింద ఇల్లు లేని పేద కుటుంబాలకు స్వంత ఇల్లు కల నెరవేర్చే దిశగా ప్రభుత్వం దృఢంగా ముందుకు సాగుతోందని నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ రేకులపల్లి భూపతిరెడ్డి అన్నారు. ఇందల్వాయి మండలంలోని గన్నారం గ్రామ శివారులో హైవే పక్కన ఉన్న రెవెన్యూ భూమిని, జిల్లా కలెక్టర్‌తో కలిసి ఆయన పరిశీలించారు. భూపతిరెడ్డి మాట్లాడుతూ, “ప్రభుత్వం రెండవ విడతలో భాగంగా 75 గజాల స్థలాన్ని ఇచ్చి పేదలకు ఇళ్లు కట్టే ప్రణాళిక చేపట్టింది. ఇందిరమ్మ ఇండ్లు పథకం పేదవాడి కలను సాకారం చేయనున్న సంక్షేమ యజ్ఞం” అని అన్నారు.రెవెన్యూ అధికారులు తక్షణమే భూమి సర్వే పూర్తి చేసి కలెక్టర్‌కు ప్రతిపాదనలు పంపాలని ఎమ్మెల్యే సూచించారు. అలాగే భూమి సేకరణ పనులు వేగవంతం చేసి పేద కుటుంబాలకు పట్టాలు ఇచ్చే దిశగా చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు.ఈ కార్యక్రమంలో వినయ్ కృష్ణ రెడ్డి, మండల తహసిల్దార్ వెంకట్రావు, కాంగ్రెస్ సీనియర్ నాయకులు మునిపల్లి సాయిరెడ్డి, సంతోష్ రెడ్డి, ఇమ్మడి గోపి, సొసైటీ చైర్మన్ గోపి, యూత్ నాయకులు ఉమ్మాజీ నరేష్, గ్రామ శాఖ అధ్యక్షులు బద్దం రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.