Take a fresh look at your lifestyle.

నేటి నుంచి సర్పంచ్ వార్డు సభ్యుల కు నామినేషన్ పక్రియ ప్రారంభం…..

0

నేటి నుంచి సర్పంచ్ వార్డు సభ్యుల కు నామినేషన్ పక్రియ ప్రారంభం

ఎడపల్లి, నవంబర్ 26 ( లోకంతీరు ) : ఎడపల్లి మండలంలోనేటి నుంచి స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీలో ఉండే సర్పంచ్ వార్డు సభ్యు లు, నామినేషన్లు దాఖలు చేసుకునే అవకాశం ఉందని ఎడపల్లి ఎంపీడీవో శంకర్ తెలిపారు,.మండలంలో తొమ్మిది నామినేషన్ కేంద్రాలను ఏర్పాట్లు చేసినట్లు ఆయన తెలిపారు. ఎన్నికల రిటర్నింగ్ అధికారితో పటు అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారులు అందుబాటులో ఉంటారన్నారు. ఉదయం నుండి సాయంత్రం ఐదు గంటల్లోగా సర్పంచ్లకు వార్డు సభ్యులకు పోటీ చసే వ్యక్తులు నామినేషన్ పత్రాలను ఎన్నికల అధికారులకు సమర్పించాలన్నారు. ఎన్నికల అధికారులకు గ్రామస్తులు సహకరించాలన్నారు. ఏ ఆర్ పి క్యాంప్ నామినేషన్ కేంద్రంలో రిటర్నింగ్ అధికారి సురేందర్ సహాయ ఎన్నికల అధికారి సాయిలు ఉంటారన్నారు అంభం (వై) తోపాటు ఏఆర్పి క్యాంప్ గ్రామాలకు చెందిన పోటీలో ఉండే వ్యక్తులు నామినేషన్లను (ఏ ఆర్ పి క్యాంప్ పోలింగ్) కేంద్రంలో దరఖాస్తు చేసుకోవాలన్నారు. ఎమ్మెస్సీ ఫారం లో నామినేషన్ కేంద్రంలో ఎన్నికల అధికారులు సునీత, విజయ, ఉండగా పోటీలో పాల్గొనే వ్యక్తులు ఎమ్మెస్సీ ఫారం పోలింగ్ కేంద్రంలో బ్రాహ్మణపల్లి, దుబ్బ తండ, జమలం, గ్రామాలకు చెందిన పోటీలో ఉండే అభ్యర్థులు నామినేషన్లు వేయవచ్చన్నారు. జైతాపూర్ నామినేషన్ కేంద్రాల అధికారులుగా మమత, రామకృష్ణ, జైతాపూర్, పోచారం, ధర్మారం గ్రామాలకు చెందిన నామినేషన్ వేసే అభ్యర్థులు జైతపూర్ పోలింగ్ కేంద్రంలో దరఖాస్తులను సమర్పించాలన్నారు. జానకంపేట నామినేషన్ కేంద్రంలో ఎన్నికల రిటర్నింగ్ అధికారిగా అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారిగా రవికుమార్ సుమంత్ ఉంటారన్నారు. జానకంపేట పోలింగ్ పోలింగ్ నామినేషన్ కేంద్రంలో జానకంపేట గ్రామానికి చెందిన పోటీలో ఉండే అభ్యర్థులు జానకంపేట పోలింగ్ కేంద్రంలోని నామినేషన్లను వేయాలన్నారు. నెహ్రు నగర్ పోలింగ్ కేంద్రం అధికారులుగా వినోద, నరేందర్ నెహ్రు నగర్ గ్రామంలో సర్పంచ్ వార్డు సభ్యులుగా పోటీలో ఉన్న వ్యక్తులు( నెహ్రు నగర్), లోనే నామినేషన్లను వేయాలన్నారు. తానాకాలాన్ నామినేషన్, పోలింగ్ కేంద్రం అధికారులుగా జోన్స్. చంద్రమౌళి,, పోటీలో ఉండే అభ్యర్థులు తానా కలాన్ బాపునగర్ గ్రామాలకు చెందిన నామినేషన్ వేసే వ్యక్తులు పోలింగ్ కేంద్రంలో నామినేషన్ దాఖలు చేయాలి. కుర్నాపల్లి పోలింగ్ కేంద్రంలో రజిని కుమార్ ప్రశాంత్ రెడ్డి ఎన్నికల అధికారులుగా ఉంటారు. కుర్నపల్లి గ్రామానికి గ్రామానికి చెందిన పోటీలో ఉండే సర్పంచ్ వాడు సభ్యుల అభ్యర్థులు కుర్నపల్లి పోలింగ్ కేంద్రంలోని నామినేషన్ దాఖలు చేయాలన్నారు. మంగళ్ పహాడ్ నామినేషన్ పోలింగ్ కేంద్రాల అధికారులుగా రమాదేవి , విజయకుమార్, నామినేషన్ వేసే అభ్యర్థులు (వ్యక్తులు) మంగళ్ పహాడ్ లో నీ నామినేషన్ కేంద్రంలో దాఖలు చేయాలి. ఎడపల్లి నామినేషన్ పోలింగ్ కేంద్రాల అధికారులుగా శ్రీనివాస్, శ్రీనివాస రావు లను నియమించినట్లు ఆయన తెలిపారు, ఎడపల్లి గ్రామానికి చెందిన సర్పంచ్ వార్డు సభ్యులకు పోటీలో ఉండే వ్యక్తులు ఎడపల్లి పోలింగ్ కేంద్రంలో నామినేషన్లను దరఖాస్తులు చేసుకోవాలని ఆయన తెలిపారు. స్థానిక సంస్థల ఎన్నికలు సజావ సాగేందుకు మండలంలోని ఆయా గ్రామాల ప్రజలు యువకులు అధికారులు సహకరించాలని ఆయన విజ్ఞప్తి చేశారు.

Leave A Reply

Your email address will not be published.