ఎడపల్లి మండలంలో కలకలం
క్షణికాఆవేశంలో భార్యను హత్య చేసిన భర్త

ఎడపల్లి , నవంబర్ 28 ( లోకంతీరు ) : ఎడపల్లి మండలంలో కుటుంబ కలహం దారుణాంతానికి దారి తీసిన సంఘటన వెలుగులోకి వచ్చింది గురువారం సాయంత్రం ఐదు గంటల నుండి ఏడు గంటల మధ్య చోటు చేసుకున్న ఈ ఘటనలో ఎం ఎస్ సి ఫారం గ్రామానికి చెందిన షేక్ హుస్సేన్ తన భార్య ఆసియా బేగం (40) తో వారి ఇంటి వద్ద తీవ్ర వాగ్వాదానికి దిగాడు కోపవేషంలో భార్య తలను గోడకు గుద్దడంతో ఆమె అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది స్థానికుల ద్వారా సమాచారం తెలిసింది ఘటన తర్వాత భార్య మృతి చెందినది అని గమనించి భయపడ్డ హుస్సేన్ ఆసియా బేగం అనారోగ్యంతో మృతి చెందిందని స్థానికులను తప్పుదారి పట్టించే ప్రయత్నం చేశారు అయితే భార్య బంధువులు ఘటన స్థలానికి చేరుకొని అబద్దాన్ని బయటపెట్టడంతో అసలు విషయం వెలుగు చూసింది వెంటనే సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకొని మృతదేహాన్ని పోస్ట్ మార్టం కోసం పంపించారు ఎడపల్లి పోలీసులు ఆసియా బేగం బంధువుల ఫిర్యాదుతో నిందితుడు షేక్ హుస్సేన్ ను అదుపులోకి తీసుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు కుటుంబ కలహాలు హింసకాండ కు దారి తీసిన ఈ ఘటనపై పోలీసులు పూర్తి వివరాలు సేకరిస్తున్నారు.