Take a fresh look at your lifestyle.

పాఠశాల ప్రహరీ గోడ కూలింది……

0

పాఠశాల ప్రహరీ గోడ కూలింది……

కట్టించేదెవరు ? 

ఎడపల్లి , డిసెంబర్ 08 ( లోకంతీరు ) : ఎడపల్లి మండలం మంగల్పహాడ్ గ్రామంలో ఉన్న జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రహరి గోడ కూలిపోయింది. గతంలో పాఠశాల చుట్టుముట్టు ప్రభుత్వ నిధులతో ప్రహరీ గోడతోపాటు గేట్లను ఏర్పాటు చేశారు. పాఠశాల మైదానంలో ఉన్న మూత్రశాలలో మరుగుదొడ్ల నీటి సౌకర్యం కొరకు అక్కడే నీటి సౌకర్యాన్ని కూడా కల్పించారు. ఇది పాఠశాల విద్యార్థులకు ఉపాధ్యాయులకు అత్యవసరమైన విషయం. ఇది ఇలా ఉండగా ఎడపల్లి మండలంలో 10 ఉన్నత పాఠశాలలు ఉన్నాయి. ఏ ఒక్క ఉన్నత పాఠశాలలో కూడా గ్రామానికి చెందిన రైతులు ధాన్యాన్ని మైదానంలో పోయారు. ఇది జగమెరిగిన సత్యం. కానీ మంగళ పహాడ్ గ్రామ సమీపాన ఉన్న జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో గ్రామానికి చెందిన రైతులు ధాన్యాన్ని ఆరబెడుతూ కుప్పలు కుప్పలుగా పోసుకుంటారు. కొన్ని సమయంలో ధాన్యం ఎండిన తర్వాత దుమ్ముదులి పాఠశాల విద్యార్థుల పైకి పారిపోతుంది. దీంతో బడి విద్యార్థులు, ఉపాధ్యాయులు కొంత ఇబ్బంది పడుతున్న విషయం గ్రామస్తులకు తెలిసే, ప్రభుత్వం ఏర్పడి చేసినా కొనుగోలు కేంద్రాలను రైతులు అనుసంధానం చేసుకొని పాఠశాల మైదానంలో ధాన్యాన్ని ఆరబెట్టుకున్న అనంతరం ధాన్యాన్ని బయట తీసుకోవడానికి రైతులు ప్రయత్నం చేస్తారు. గత సంవత్సరం గ్రామానికి చెందిన ఓ రైతు పాఠశాల మైదానంలో ధాన్యాన్ని ఆరబెట్టుకొని దర్జాగా కొనుగోలు కేంద్రానికి విక్రయించుకున్నారు. అదే సమయంలో లారీ లోడుతో బయటకు వచ్చే ముందు ప్రహరీ గోడను ఢీ కొట్టింది.గోడ కూలిపోయింది. అప్పటినుండి ఇప్పటివరకు నిర్మాణంలోకి రాలేదు. బడిలో ఉన్న పిల్లలకు రక్షణ లేకుండా పోయింది. ఇది ఇలా ఉండగా ప్రహరీ గోడ కు తలుపులు ఉన్నాయి. వాటిని సైతం లారీలు ఢీకొట్టడంతో పూర్తిగా విరిగిపోయాయి. వానకాలం పంటకు ధాన్యాన్ని పండించిన రైతులు మళ్లీ అదే పాఠశాల మైదానంలో ధాన్యాన్ని దర్జాగా ఆరబెట్టుకున్న అనంతరం. చివరి ముగింపు సమయంలో మైదానంలో ఉన్న ధాన్యాన్ని లారీ తీసుకొని బయటకు వస్తుండగా బలంగా ప్రహరీ గోడకు మరో సైడ్ ఢీకొట్టడంతో రెండో పక్క కూడా గోడ కూలిపోయింది. గత పంటకు అట్లా అంటే, ఈ పంటకు ఇల జరిగింది. పాఠశాలలో చదువుకుంటున్న విద్యార్థులకు రక్షణ లేకుండా పోయింది. క్రితంలో ఇదే పాఠశాలలో దొంగతనం కూడా జరిగింది .ఇది గ్రామస్తులు తెలిసిన విషయమే, పాఠశాలలో విలువైన కంప్యూటర్ వస్తువులు ఉన్నాయి. ఏది ఏమైనప్పటికీ స్థానిక గ్రామ రైతులు ఏ ఒక్కరు కూడా పాఠశాల అభివృద్ధికి మౌలిక సౌకర్యాలకు దాత రూపంలో ఒక్క రూపాయి కూడా ఇవ్వరు కానీ, పాఠశాల మైదానాన్ని మాత్రం దర్జాగా వాడుకొని బడి పిల్లలకు, ఉపాధ్యాయులకు రక్షణ లేకుండా పోతుందని గ్రామంలో చర్చనీయంగా మారింది. ప్రహరి కూడా రెండు పక్కల కూల్పోవడమే కాకుండా గేట్లు మరవతలకు నోచుకోకుండా పోవడం పట్ల బడి పిల్లలకి ఉపాధ్యాయులకు రక్షణ కల్పిస్తూ ప్రహరీ గోడకు ఇరువైపులా మరవతులు జరపడంతో పాటు ప్రధాన రహదారి గేట్లను కూడా మరమ్మతులు చేయించాలని అప్పుడే పాఠశాల విద్యార్థులకు, ఉపాధ్యాయులకు రక్షణ ఉండడం కాకుండా పశువులు కూడా పాఠశాల మైదానంలోకి వెళ్లకుండా ఉంటాయని గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు. పాఠశాలలో విలువైన కంప్యూటర్లతో పాటు వస్తు సామాగ్రి ఉన్నందున ఇప్పటికైనా పాఠశాలలో వరి ధాన్యాన్ని ఆరబెట్టి విక్రయించుకున్న రైతులు ప్రహరి గోడనిర్మాణానికి కృషి చేయాలని గ్రామస్తులు కోరుతున్నారు.

Leave A Reply

Your email address will not be published.