ప్రమాణ స్వీకారానికి ముస్తాబైన గ్రామపంచాయతీలు
ఎ
డపల్లి , డిసెంబర్ 18 ( లోకంతీరు ) : స్థానిక సంస్థల గ్రామపంచాయతీ ఎన్నికల్లో భాగంగా ఈనెల 11వ తేదీన పంచాయతీ ఎన్నికలలో నూతన సర్పంచులు, ఉప సర్పంచ్లు, వార్డు సభ్యులు ఎన్నికైన విషయం అందరికీ తెలిసిందే. అధికారికంగా నియకమైన సర్పంచులు ఉప సర్పంచ్లు వార్డు సభ్యులు ఈనెల 22న అధికారికంగా ప్రమాణ స్వీకరణతోపాటు బాధ్యతలు చేపట్టనున్నారు. గత రెండు సంవత్సరాలుగా గ్రామపంచాయతీలలో సర్పంచులు ఉప సర్పంచ్లు వార్డు సభ్యులు లేకపోవడంతో ప్రభుత్వమే గ్రామపంచాయతీ కార్యదర్శులతో పాటు మండల స్థాయి అధికారులతో కలిసి ఇప్పటి వరకు నెట్టుకొచ్చిన విషయం అందరికీ తెలిసిందే. ఇటీవల జరిగిన గ్రామపంచాయతీ ఎన్నికలలో గెలుపొందిన సర్పంచులు గ్రామపంచాయతీలకు కొత్త కళ వచ్చేందుకు రంగులు వేయిస్తున్నట్లు సమాచారం.