8 ఏళ్ల చిన్నారి పై అఘాయిత్యం

భూపాలపల్లి , ఫిబ్రవరి 09 ( లోకంతీరు ) : భూపాలపల్లి జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. రేగొండ మండలం లోని ఎనిమిదేళ్ల చిన్నారి ఇంటి ముందు ఆడుకుంటున్న క్రమంలో ఓ యువకుడు లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఈ విషయాన్ని మరో యువకుడికి చెప్పడంతో అతను కూడా బాలిక పై లైంగిక దాడికి పాల్పడ్డాడు. బాలిక అస్వస్థతకు గురికావడంతో తల్లిదండ్రులు ఆస్పత్రిలో చేర్పించి పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు ఇద్దరు యువకులపై పోక్సో కేసు నమోదు చేశారు.