Take a fresh look at your lifestyle.

మున్నూరు కాపుల ఐక్యతే మనందరికీ మనగడ…..

0

మున్నూరు కాపుల ఐక్యతే మనందరికీ మనగడ

– నిజామాబాద్ నగర తొలి మేయర్ ధర్మపురి సంజయ్

నిజామాబాద్  , మార్చి 01 ( లోకంతీరు ) : మున్నూరు కాపుల ఐక్యతే మన కులస్తులందరికీ మనుగడ లాంటిదని నిజాంబాద్ నగర తొలి మేయర్ మున్నూరు కాపు సంఘం జిల్లా అధ్యక్షుడు ధర్మపురి సంజయ్ అన్నారు.ఆదివారం గత నెలల్లో ఎన్నుకోబడిన మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో విజయం సాధించిన కార్పొరేటర్లకు అలాగే ఆర్ముర్ , బోధన్, బీంగల్ కౌన్సిలర్లకు ఆయన ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నేను అందరి అభివృద్ధి కోరే వాడినని నాలో ఎటువంటి స్వార్థం లేదని కుల పెద్దలను ఆశీర్వాదంతో కులము యొక్క అభివృద్ధి కొరకు ఎంతకైనా పోరాడుతానని అన్నారు.గత కొన్ని రోజుల క్రితం సర్పంచ్ గా ఎన్నికైనటువంటి సర్పంచ్ లకు ఘనంగా సన్మానించడం జరిగిందని, అదే విధంగా మొన్న జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో గెలుపొందిన మున్నూరు కాపు కులస్తులైనటువంటి కార్పొరేటర్లకు జిల్లాలోని వివిధ మున్సిపల్ లో గెలుపొందిన మున్నూరు కాపు సభ్యులందరికి ఈ రోజు సన్మానించుకోవడం నాకు చాలా ఆనందంగా కలగజేసింది అన్నారు. కానీ ఒక వర్గానికి చెందిన కొందరు నాయకులు ఈ సన్మానికి రాకపోవడం కొంచెం బాధ కలిగించినా వాళ్లు మాత్రము ఇప్పుడు ఎల్లప్పుడూ నా గుండెలోనే ఉంటారని అన్నారు. వాళ్ల గురించి ఎప్పుడు మర్చిపోను అనే మంచి ఉద్దేశంతో వారు ఇక్కడ లేకపోయినా వాళ్ళు స్వతహాగా కుర్చీలకు సన్మానించడం జరిగిందని అన్నారు. వారికి రావాలని ఉన్నప్పటికీ కొన్ని శక్తులు వారికి అడ్డుకున్నాయని , వారి బాధని నేను అర్థం చేసుకోగలను అన్నారు. ఏది ఏమైనప్పటికీ అందరూ ఏకమైనప్పుడే మన అందరి మనుగడ కొనసాగుతుందని అన్నారు. ఆర్మూర్, భీంగల్, బోధన్, నిజామబాద్ నగరంలో గెలిచినటువంటి మున్సిపల్ కార్పొరేషన్ తో పాటు మున్సిపల్ కూడా మంచి పనులు చేసి అందరికి పనితనంలో ఆదర్శం గా ఉండాలన్నారు. నేను కొంత కాలంగా అందరికి సన్మానించుకోవడం ఒక అనవయితీగా మార్చడం జరిగిందన్నారు. మనం ఐక్యంగా ఉన్నప్పుడే మనం అందరం బాగుంటామని మనలోని భావాలు ఒకరిని ఒకరు చెప్పుకున్నప్పుడే వారి యొక్క కష్టసుఖాలు తెలుస్తాయని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు. ఎటువంటి సమస్య వచ్చినా మీ అన్న మీ ముందు ఉంటానని హామీ ఇచ్చారు.

Leave A Reply

Your email address will not be published.