రాష్ట్రీయ ఏకతా దివస్ భారత్ పర్వ్” వేడుకలకు గుజరాత్ కు బయలుదేరిన ఇందూరు వాసులు

నిజామాబాద్, అక్టోబర్ 29 ( లోకంతీరు న్యూస్ ) : తెలంగాణాను కబంధ హస్తాల నుండి విమోచనం చేసిన ఉక్కుమనిషి సర్దార్ వల్లభాయ్ పటేల్ 151 వ జయంతి ని పురస్కరించుకొని ఈ నెల 31వ తేదీ శనివారం రోజున కేంద్ర ప్రభుత్వం గుజరాత్ రాష్ట్రంలోని నర్మదా జిల్లా, కేవడియా లో “రాష్ట్రీయ ఏకతా దివస్ భారత్ పర్వ్” వేడుకలను “స్టాచ్యూ ఆఫ్ యూనిటీ” వద్ద నిర్వహిస్తా ఉంది.ఈ యొక్క ఏకతా దివస్ వేడుకలకు నిజామాబాద్ జిల్లా నుండి 30 మంది బయలుదేరడమైనది.ఇందూరు వాసులకు ఇంచార్జ్ గా ఏసీపి కృష్ణా గౌడ్ తన విధులను నిర్వహించడమైనది.ఈరోజు సికింద్రాబాద్ లోని రైల్వే స్టేషన్ లో ఉదయం 11:30 నిం.లకు గుజరాత్ కు రైలు బయలుదేరడమైనది.ఈ యొక్క ఏకతా దివస్ వేడుకలు జాతీయ ఐక్యత, సమగ్రత, భద్రత మరియు సామరస్యం యొక్క విశిష్టతను గుర్తు చేస్తూనే భారతదేశ ఐక్యతకు, జాతీయ స్ఫూర్తికి నిదర్శనంగా ఈ యొక్క వేడుకలు నిలువబోతున్నాయి.ఈ వేడుకలకు పోలీసులు, పారామిలిటరీ బలగాలతో పాటు భారత వైమానిక దళాలు పాల్గొని తమ అద్భుతమైన ప్రదర్శనలను ఇచ్చి “ఏక్ భారత్ శ్రేష్ట్ భారత్”అనే విధంగా ఈ యొక్క కార్యక్రమాలు ఓ చరిత్రను సృష్టిస్తాయ్ అనడంలో సందేహం లేదు.గుజరాత్ కు బయలుదేరిన వారిలో జెస్సు అనిల్ కుమార్, నరేష్ చారి, ఆరేపల్లి నర్సయ్య, రవీందర్, శ్రీకాంత్, శ్రీనివాస్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.