Take a fresh look at your lifestyle.

చత్రపతి శివాజీ జయంతికి సెలవేది…..

0

శివాజీ మహారాజ్ జయంతి రోజున సెలవు దినంగా ప్రకటించాలి….

నిజామాబాద్, ఫిబ్రవరి 18 ( లోకంతీరు ) : ఆరె క్షత్రియ వంశస్థులు, దైవాంశ సంభూతులు, పీడిత వర్గాల వెలుగుదివ్వే, అఖండ భారత్ గుండె చప్పుడు, వీరాధి వీరుడు, హిందూ హృదయ సామ్రాట్ శ్రీ చత్రపతి శివాజీ మహారాజ్ పుట్టిన రోజైన ఫిబ్రవరి 19వ తేదీని మనం అయన జయంతి రోజుగా జరుపుకుంటున్నాం. మహనీయుల పుట్టిన రోజులను జాతీయ సెలవు దినంగా ప్రకటించడం మన దేశ సంప్రదాయంగా భావిస్తున్నాం. కానీ పీడిత, అణగారిన, బడుగు, బలహీన వర్గాల కోసం కోట్లాడిన వీరుడు, ధీరుడు, దైవాంశ సంభూతుడు, చరిత్రకారుడు, భారతీయతను ప్రపంచం నలుమూలలా చాటిన మహారాజు ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతిని మాత్రం జాతీయ సెలవు దినంగా జరుపుకోవడం లేదు. ఇది నిజంగా దురదృష్టకరం. స్వాతంత్య్రం వచ్చి 75ఏళ్ళైనా శివాజీ జయంతిని సాధారణ సెలవు దినంగా పాటించక పోవడమంటే, అయన చరిత్రను, సేవలను, భారతీయ పౌరుషాన్ని, వీరత్వాన్ని, పాలనను గౌరవించక పోవడమే. ప్రభుత్వాలు మారిన, ఏళ్లుగా శివాజీ జయంతికి సెలవు ఇవ్వాలనే మా డిమాండు నెరవేరడం లేదు. ఇంతకంటే అవమానం మా ఆరె క్షత్రియ సమాజానికి ఉండదు. మా మూల పురుషుడు, కుల బాంధవుడు, యుగ పురుషుడు శివాజీ జయంతిని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఖచ్చితంగా సెలవు దినంగా ప్రకటించాల్సిందే. మా ఆరాధ్య దైవం శ్రీ శివాజీ మహారాజ్ జయంతి రోజున సెలవు దినంగా పాటించకుంటే, అయన వంశీకులమైన ఆరె క్షత్రియుల మనస్సులు, మనోభావాలు గాయ పడతాయనడంలో సందేహం లేదు. మేము శివాజీ మార్గంలో నడుస్తూ, అయన వంశీకులుగా ముందుకు వెళుతున్నాం. తెలంగాణలో సుమారు 30లక్షల పైబడి శివాజీ వంశీకులం ఉన్నాం. మా మనోభావాలను గౌరవించాల్సిన బాధ్యత కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై ఉంది. వివిధ సామాజిక వర్గాల మహనీయుల జయంతిని సెలవు దినంగా ప్రకటిస్తూ, అధికారికంగా జయంతి ఉత్సవాలు నిర్వహిస్తున్నప్పుడు, శివాజీ జయంతిని ఎందుకు అధికారికంగా నిర్వహించడం లేదని ప్రశ్నిస్తున్నాం.

పర దేశీయుల దండ యాత్రల నుంచి, పరాయి పాలన దుర్మార్గాల నుంచి భారతదేశాన్ని కాపాడిన వీర శివాజీకి దక్కాల్సిన గౌరవం, గుర్తింపు ఇదేనానని ప్రభుత్వాలను అడుగుతున్నాం. మా ఆరె క్షత్రియుల విశ్వాసాల ప్రకారం ధర్మ రక్షణకు జన్మించిన కారణ జన్ముడు, సాక్షాత్తు భగవంతుని స్వరూపమే శివాజీ మహారాజు అని మేము భావిస్తాం. అలాగే భవాని మాత అనుగ్రహముతో అమ్మవారి ఖడ్గం పొందినా హైందవ సామ్రాజ్య రాజుగా శివాజీని కీర్తిస్తాం. అఖండ భారతంలో హైందవ సంస్కృతి పెంపుకు, ఆలయాల పరిరక్షణకు పాటుపడిన ధీరుడతని ప్రపంచమే గుర్తించింది. తల్లి, గురువు నేర్పిన మార్గంలో నడిచి, దేశానికే స్ఫూర్తిగా నిలిచిన శివాజీ మహారాజ్ చరిత్రను అందరు ఆదర్శంగా తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. రాజకీయాలకు, కుల, మతాలకు అతీతంగా శివాజీని గౌరవించుకోవాల్సిన అవసరం ఉంది. అందుకే రాజకీయ పార్టీలు శివాజీ చరిత్రను రాజకీయ కోణంలో చూడరాదు. ఆలస్యమైనా యుగ పురుషుదు శివాజీని సగర్వంగా కొల్చుకోవాల్సిన సమయం ఆసన్నమైంది.

Leave A Reply

Your email address will not be published.