Take a fresh look at your lifestyle.

రోడ్డు భద్రత మాసోత్సవాల పోస్టర్లను ఆవిష్కరించిన కలెక్టర్…..

0

రోడ్డు భద్రత మాసోత్సవాల పోస్టర్లను ఆవిష్కరించిన కలెక్టర్

నిజామాబాద్, జనవరి 02 ( లోకంతీరు ) : జాతీయ రోడ్డు భద్రత మాసోత్సవాలను పురస్కరించుకుని జిల్లా రవాణా శాఖ ఆధ్వర్యంలో ముద్రించిన కరపత్రాలు, ఫ్లెక్సీలను కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు గురువారం తన చాంబర్ లో ఆవిష్కరించారు. రోడ్డు ప్రమాదాలను నిలువరించేందుకు వీలుగా ప్రతి ఒక్కరూ రోడ్డు భద్రతా చర్యలు పాటించేలా ప్రజల్లో అవగాహన పెంపొందించాలని ఈ సందర్భంగా కలెక్టర్ అధికారులకు సూచించారు. జిల్లా వ్యాప్తంగా అన్ని ప్రాంతాలలో కరపత్రాలు, ఫ్లెక్సీల ద్వారా విస్తృత ప్రచారం చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా రవాణా శాఖ అధికారి ఉమామహేశ్వర్, మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ కిరణ్ తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.