Take a fresh look at your lifestyle.

ఘనంగా సావిత్రిబాయి పూలే జయంతి…

0

ఘనంగా సావిత్రిబాయి పూలే జయంతి

నిజామాబాద్ ,జనవరి 03 (లోకంతీరు) : నిజామాబాద్ నగరంలో పలు సంఘాల నాయకులు సావిత్రిబాయి పూలే జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా ఎమ్మార్పీఎస్ నాయకులు మాట్లాడుతూ సావిత్రిబాయి పూలే 194 జయంతి సందర్భంగా ఘనమైన శుభాకాంక్షలు తెలిపారు. సావిత్రిబాయి పూలే 1831 జనవరి 3న జన్మించడం జరిగిందని, 1897 మార్చి 10న భారతీయ సంఘసంస్కర్త ఉపాధ్యాయులు రచయిత్రి ఆమె అన్ని వర్గాల అభ్యున్నత స్థితికి కృషిచేసిoదని జ్యోతిరావు పూలే భార్య కులమత్త భేదాలకు అతీతంగా సమాజాన్ని ప్రేమిందన్నారు. సమూహితంగా అన్ని వర్గాలకు , కులాల అధునిక విద్య ద్వారా విద్యాదారనే స్త్రీల విముక్తి సాధ్యపడుతుందని అన్నారు. ఆమె తన భర్తతో కలిసి కలిసి 1848 జనవరి 1న పూణేలో మొట్టమొదటిసారిగా బాలికల పాఠశాలను ప్రారంభించి మహిళలకు హక్కులు సాధించిన ఘనత తల్లి సావిత్రిబాయి దేనని తెలియ చేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ సీనియర్ నాయకులు మాదారపు రాములు , మాదిగ అంబేద్కర్ కాలనీ డివిజన్ హరిజన సేవా సంఘం అధ్యక్షుడు రంబ కృష్ణ గాజుల రామచందర్, దుర్గిబాలరాజ్ Pads శేఖర్ , సుధాకర్ , మహేష్, యాదగిరి తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.