ముగిసిన కాకతీయ విద్యాసంస్థల క్రీడోత్సవ్ సంబరాలు
– మూడు రోజులుగా కాకతీయ విద్యాసంస్థలలో సంబరాలు
– పోటీలలో గెలిచిన విద్యార్థులకు బహుమతులు అందజేత
– ముందస్తు సంక్రాంతి పండగ సంబరాలు


నిజామాబాద్, జనవరి 10 ( లోకంతీరు ) : నగరంలోని కాకతీయ విద్యాసంస్థలు ప్రగతి- నగర్ & సుభాష్ నగర్ క్యాంపస్) లలో గత 3 రోజులుగా జరుగుతున్న క్రీడోత్సవ్ పోటీలు శుక్రవారం జరిగిన బవలమతి ప్రధానోత్సవంతో ఘనంగా ముగిశాయి. ఈ పోటీలలో భాగంగా వివిధ ఆటలలో జరిగిన పోటీల్లో గెలిచిన పలు విభాగాలకు చెందిన విజేతలకు ప్రధమ, ద్వితీయ స్థానాలకు ట్రోఫీని, విద్యార్థులకు మెడల్స్ ను అందించడం జరిగింది. ఈ కార్యక్రమంలో విద్యాసంస్థల డైరెక్టర్ రామోజీరావు మాట్లాడుతూ…. గత 3 రోజులుగా జరుగుతున్న ఈ పోటీలలో విద్యార్థులంతా చాలా ఉత్సాహంగా పాల్గొని, చక్కని ప్రదర్శన కనబరిచారని తెలుపుతూ – విజేతలకు ప్రత్యేక అభినందనలను తెలియజేశారు. ఇదే స్ఫూర్తితో ఇంకా ముందు ముందు మరెన్నో విజయాలను సాధించాలని తెలిపారు. ముగింపు కార్యక్రమం అనంతరం మధ్యాహ్నం ” సంక్రాంతి సంబరాలు” పేరుతో వేడుకలను నిర్వహించారు. ఇందులో విద్యార్థినులకు ముగ్గుల పోటీలు, విద్యార్థులకు పతంగుల పోటీలను నిర్వహించారు. ఆటపాటలతో ఎంతో సంతోషంగా కార్యక్రమాలను ముగించారు. ఈ వేడుకలలో విద్యా సంస్థల డైరెక్టర్ రామోజీ రావు, ప్రిన్సిపాల్ చంద్రశేఖర్, వైస్క్రిప్రిన్సిపాల్ దిగంబర్, ఉపాధ్యాయబృందం మరియు విద్యార్థులు పాల్గొన్నారు.