కందకుర్తి త్రివేణి సంగమానికి సందర్శించిన త్రిపుర గవర్నర్

ఎడపల్లి, ఫిబ్రవరి 11( లోకంతీరు) : రెంజల్ మండలంలోని కందకుర్తి గ్రామంలో గల త్రివేణి సంగమాన్ని త్రిపుర గవర్నర్ ఇంద్రసేనారెడ్డి మంగళవారం సందర్శించారు ఈ సందర్భంగా ఆయనకు గ్రామస్తులు ఘన స్వాగతం తెలిపారు ఈ సందర్భంగా త్రిపుర గవర్నర్ ఇంద్రసేనారెడ్డి మాట్లాడుతూ ఈ కందకుర్తి గ్రామం చరిత్రత్మక కేంద్రంగా మొట్టమొదటిసారి ఆర్ఎస్ఎస్ ప్రారంభమైన గ్రామం వ్యవస్థాపకులు డాక్టర్ బలి రామ్ వాగ్దేవర్ జన్మించిన కందకుర్తి గ్రామం అని అందుకే ఈ గ్రామాన్ని సందర్శించినట్లు ఆయన పేర్కొన్నారు ఈ సందర్భంగా ఆర్ఎస్ఎస్ వ్యవస్థాపకులు నిర్మాణంలో ఉన్న స్మృతి మందిరం పనులను గవర్నర్ పరిశీలించారు ఆర్ఎస్ఎస్ స్థాపించి 2025 దసరా నాటికి 100 సంవత్సరాలు పూర్తి అవుతున్న సందర్భంగా స్మృతి మందిరం పనులను పూర్తి చేయాలని స్థానికులకు సూచించారు ఈ కార్యక్రమంలో నాయకులు మోహన్ రెడ్డి తదితరులు ఉన్నారు అనంతరం ఆయన ప్రసిద్ధిగాంచిన త్రివేణి పుణ్యక్షేత్రంలో పూజలు జరిపించారు తరువాత బాసర్ లొ కొలువైన శ్రీ సరస్వతి దేవి అమ్మవారిని దర్శించుకున్నారు ప్రత్యేక పూజ కార్యక్రమాలు చేశారు బాసర శ్రీ సరస్వతి దేవి ఆలయానికి చేరుకున్న త్రిపుర రాష్ట్ర గవర్నర్ ఇంద్రసేనారెడ్డి ఆలయ అధికారులు అర్చకులు మంగళ వాయిద్యాలతో పూర్ణ కుంభ స్వాగతం పలికారు శ్రీ సరస్వతి అమ్మవారి సన్నిధిలో గవర్నర్ ఇంద్రసేనారెడ్డి తో ఆలయ స్థానాచార్యులు ప్రవీణ్ పటాక్ ప్రధాన అర్చకులు సంజీవ్ పూజారి ప్రత్యేక పూజలు జరిపించి హారతి ఇచ్చి ఆశీర్వదించారు ఆలయ ఆశీర్వచనం మండపంలో గవర్నర్ ఇంద్రసేనారెడ్డిని ఆలయ ఈవో సుధాకర్ రెడ్డి చైర్మన్ శరత్ పటాక్ శాల్వాతో సన్మానించి అమ్మవారి జ్ఞాపి కను ప్రసాద్ దాన్ని అని అందజేశారు ఆలయ ప్రతిష్ట గురించి వివరించారు బాసర్ లోని బిజెపి మాజీ సర్పంచ్ శైలజ సతీష్ రావు ఇంట్లో త్రిపుర గవర్నర్ అల్పాహారం తీసుకున్నారు