నిజామాబాదులో వ్యవసాయ అధికారి తనిఖీలు
– యూరియాను మోతాదులో వాడండి
– వ్యవసాయ అధికారి రైతులకు తగు సూచనలు
నిజామాబాద్ అర్బన్ , సెప్టెంబర్ 01 ( లోకంతీరు ) : నిజామాబాద్ నగరంలో ని పలు పురుగుల మందులు, యూరియా దుకాణాల్లో అర్బన్ వ్యవసాయ అధికారి సోమవారం తనిఖీలు నిర్వహించారు. ఈ మధ్య కాలంలో భారీగా కురిసిన వర్షాలకు భారీగా పంట నష్టం వాటిల్లడంతో రైతులు అధిక మొత్తంలో యూరియా ను వాడవద్దని నిజామాబాద్ అర్బన్ అగ్రికల్చర్ అధికారి మహేందర్ రెడ్డి అన్నారు.సోమవారం తనిఖీల్లో భాగంగానే ఈ రోజు కూడా తనిఖీలు నిర్వహించి స్టాకు నిలువలు తెలుసుకోవడం జరిగిందన్నారు. రైతులు యూరియాను అధిక మొత్తంలో వాడితే పంటకు నష్టం జరిగే అవకాశం ఉందన్నారు. ఈ సందర్భంగా మహేందర్ రెడ్డి మాట్లాడుతూ అర్బన్ రైతులు అధికారుల ఆదేశాల మేరకు మందులను ఉపయోగించాలన్నారు. సోమవారం యదా విధిగానే తనిఖీలో భాగంగా నగరంలోని పలు పెస్టిసైడ్స్ ,పట్లేజర్ ,సీడ్స్ దుకాణలను గోదాములను పరిశీలించి ఉన్నటువంటి స్టాకు వివరాలు తెలుసుకున్నామన్నారు. ప్రస్తుతం అర్బన్ లో యూరియా కొరత లేదని తెలిపారు. రైతులు అధిక మొత్తంలో యూరియా , డీఏపీ లను ఉపయోగించి పంటను పాడు చేసుకోవద్దని సూచించారు.