ఏఆర్పి క్యాంప్ ప్రభుత్వ ఉన్నత పాఠశాల విద్యార్థులకు ఐడి కార్డు లు పంపిణీ
ఎడపల్లి, సెప్టెంబర్ 18 ( లోకంతీరు ) : ఏడపల్లి మండలం ఏఆర్పి క్యాంప్ ప్రభుత్వ ఉన్నత పాఠశాల (జి హెచ్ ఎస్)లోఆరో తరగతి నుండి పదవ తరగతి వరకు చదువుతున్న బాలబాలికలకు ఐడీ కార్డులాను ము ఖగుర్తింపు కార్డులను ఏఆర్పి క్యాంప్ గ్రామ పూర్వ విద్యార్థి తోట రాజశేఖర్ విద్యుత్ శాఖ( ఏ డి ఈ) నిజామాబాద్ , తండ్రి తోటలింగం (మాజీ సర్పంచ్), జ్ఞాపకార్థము మేరకు సుమారు పదివేల రూపాయలు విలువగల ఐడి కార్డ్స్‌ను తోట రాజశేఖర్ పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు రజిని కుమారి మాట్లాడుతూ పాఠశాల అభివృద్ధికి అన్ని విధాలుగా సహాయ సహకారమందిస్తున్న తోట రాజశేఖర్ గారినీ అభినందిస్తూ పాఠశాల విద్యార్థులు ప్రైవేటు పాఠశాలకు దీటుగా చదివి పాఠశాల పేరును గ్రామము యొక్క పేరును నిలబెడతారని పేర్కొన్నారు తోట రాజశేఖర్ గారు మాట్లాడుతూ తాము ఏ పదవిలో ఉన్న ఉన్నత స్థానంలో ఉన్న చదివిన పాఠశాలను మరియు గ్రామమును ఎప్పటికీ మర్చిపోము పాఠశాల అభివృద్ధికి అన్ని విధములుగా తోడ్పాటు అందిస్తామని విద్యార్థులందరూ మంచిగా చదివి గొప్ప విజయాలను సాధించి మన పాఠశాలకు గ్రామమునకు మంచి పేరు తేవాలని ఆయన ఆశ భావం వ్యక్తం చేశారు. .అంతే కాకుండా విద్యుత్ యొక్క వినియోగము జాగ్రత్తల గురించి విద్యార్థులందరికీ అవగాహన కల్పించారు.అంతేకాకుండా రెడ్ క్రాస్ సొసైటీ గురించి రక్తదానం యొక్క ఉపయోగం దాని విలువ గురించి విద్యార్థులందరికీ అవగాహన చేశారు.ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు రజనీ కుమారి, సురేందర్‌గౌడ్, సురేందర్. ఉపాధ్యాయ బృందం పూర్వ విద్యార్థులు నయానీ బలరాం, శ్రీనివాస్ గౌడ్, రాజు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.