బోధన్ పట్టణంలో పర్యవేక్షించిన పోలీస్ కమిషనర్
ఎడపల్లి, సెప్టెంబర్ 03 ( లోకంతీరు ) : బోధన్ పట్టణంలో దుర్గామాత విగ్రహాల నిమజ్జన బందోబస్తు ఏర్పాట్లను పర్యవేక్షించిన పోలీస్ కమిషనర్ శుక్రవారం సాయంత్రం సమయంలో బోధన్ పోలీస్ స్టేషన్ పరిధిలో గల దుర్గామాత విగ్రహాల నిమజ్జన బందోబస్తు ఏర్పాట్లను గౌరవనీయులు నిజామాబాద్ పోలీస్ కమిషనర్ శ్రీ పి.సాయి చైతన్య, ఐపీఎస్. గారు పర్యవేక్షించడం జరిగింది.
ఈ సందర్భంగా పోలీస్ కమిషనర్ గారు మాట్లాడుతూ సిబ్బంది తమ విధుల పట్ల నీకచ్చిగా ఉండాలని అన్నారు. ఎక్కడ ఇలాంటి ఇబ్బందులు ఉన్న లేదా ఎలాంటి సమాచారం తెలిసిన తమపై స్థాయి అధికారులకు హుటాహుటిన తెలియజేయాలని తెలిపారు. ఎక్కడ ట్రాఫిక్ ఇబ్బందులు కలవకుండా ట్రాఫిక్ సిబ్బంది తగు జాగ్రత్తలు తీసుకోవాలని తెలియజేశారు. బందోబస్తు లో అన్ని రకాల తగు జాగ్రత్తలు తీసుకోవాలని సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ప్రజలందరూ సంబంధిత పోలీసు అధికారులకు మరియు ట్రాఫిక్ సిబ్బందికి సహకరించగలరని అన్నారూఅనంతరము సార్వజనిక్ ఉత్సవ కమిటీ అద్వర్యం లో గల దుర్గామాత విగ్రహాన్ని దర్శించుకోవడం జరిగిందిఈ సందర్భంగా బోధన్ ఎసిపి శ్రీ శ్రీనివాస్ , బోధన్ ఎస్ హెచ్ ఓ శ్రీ వెంకట్ నారాయణ తదితరులు పాల్గొన్నారు