Take a fresh look at your lifestyle.

గోరక్షకుడు సోను సింగ్ పై కాల్పులు జరిపిన ఇబ్రహీంను అరెస్ట్ చేయాలి……

0

గోరక్షకుడు సోను సింగ్ పై కాల్పులు జరిపిన ఇబ్రహీంను అరెస్ట్ చేయాలి

  • నిజామాబాద్ జిల్లా కలెక్టర్ కువినతి

ఎడపల్లి , అక్టోబర్ 25 ( లోకంతీరు ) :  హైదరాబాద్ శివారులోని పోచారం ఐటి కారిడార్ పరిధిలో గోవుల అక్రమ రవాణాను అడ్డుకునే ప్రయత్నంలో గోరక్షకుడు సోను సింగ్ (ప్రకాష్) పై ఇబ్రహీం అనే వ్యక్తి తుపాకీతో కాల్పులు జరపడం పట్ల తీవ్ర అగ్రహం వ్యక్తం అవుతుంది ఈ ఘటన దేశ చట్టాన్ని మానవత్వాన్ని తాకట్టు పెట్టిన దారుణ చర్యగా భారతీయ జనతా పార్టీ నేతలు ఖండిస్తున్నారు ఈ నేపథ్యంలో నిజామాబాద్ జిల్లా భారతీయ జనతా పార్టీ అధ్యక్షులు దినేష్ పటేల్ కుల చారి జిల్లా ఉపాధ్యక్షులు కందగట్ల రామచందర్ పార్టీ నేతలతో కలిసి జిల్లా కలెక్టర్ కు సమర్పించిన వినతి పత్రంలో నిందితుడు ఇబ్రహీం ను తక్షణమే అరెస్టు చేయాలని చట్టపరంగా కఠినమైన శిక్ష విధించాలని డిమాండ్ చేస్తూ అదేవిధంగా రాష్ట్రవ్యాప్తంగా గోవుల అక్రమ రవాణా నిరోధానికి కఠిన నిఘ వ్యవస్థను అమలు చేయాలని కోరారు భారతీయ జనతా పార్టీ నాయకులు రాష్ట్రంలో గో సంరక్షణ చట్టంను వెంటనే అమలు చేసి గోవుల పవిత్రత సంస్కృతి సంప్రదాయాలను కాపాడాలని విజ్ఞప్తి చేస్తూ గోరక్షకులపై దాడులు నిరోధించకపోతే ప్రజా ఉద్యమం తప్పదని హెచ్చరించారు దోషులను అరెస్టు చేసి కఠిన చర్యలు విధించాలని బిజెపి డిమాండ్ చేస్తుందని హిందువుల భద్రతకు హామీ ఇవ్వలనీ అన్నారు

Leave A Reply

Your email address will not be published.