క్రీడలతో యువతకు మానసిక దృఢత్వం
-
బోధన్ ఎసిపి శ్రీనివాస్

ఎడపల్లి , నవంబర్ 05 ( లోకంతీరు ) : సమాజంలో ఉన్న చెడును యువతతోనే దూరం చేసుకోవచ్చని, యువత చెడు అలవాట్లకు దూరంగా ఉండాలని బోధన్ ఎసిపి శ్రీనివాస్ అన్నారు. ఎడపల్లి మండలం జానకంపేట గ్రామ శివారులో గల సి టిసి కేంద్రంలో బోధన్ పోలీస్ స్టేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన క్రికెట్ టోర్నమెంట్ను బుధవారం ఏసిపి శ్రీనివాస్ ప్రారంభించారు.బోధన్ రూరల్ ,ఏడపల్లి, రెంజల్ పోలీస్ స్టేషన్ పరిధిలోగల గ్రామాలలోని క్రికెట్ జట్టు యువకులు పాల్గొన్నారు. క్రీడాకారులను పోలీస్ అధికారులు పరిచయం చేసుకున్నారు. ఎసిపి శ్రీనివాస్ క్రికెట్ టోర్నమెంట్ ప్రారంభించారు ఈ సందర్భంగా ఏసీపీ శ్రీనివాస్ మాట్లాడుతూయువతసన్మానమార్గంలో నడిచినప్పుడే ప్రజలు మారే అవకాశం ఉందని ఆయన అన్నారు. మద్యపానం, సైబర్ నేరాల నుండి దూరంగా ఉండడం, చెడు వ్యసనాలకు పాల్పడకుండా ఉండాలని పోలీస్ శాఖ లక్ష్యంగా పెట్టుకొని క్రికెట్ పోటీలను నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు. క్రికెట్ పోటీల్లో పాల్గొన్న జట్లు సోదర భావంతో ఆడాలన్నారు.క్రీడలు ఆడడం వల్ల స్నేహభావం పెంపొందిస్తాయన్నారు.యువత మంచి మార్గంలో ఉండాలన్నదే పోలీస్ శాఖ లక్ష్యమన్నారు.కార్యక్రమంలో బోధన్ రూరల్ సిఐ విజయ్ బాబు, ఎడపల్లి ఎస్సై ముత్యాల రమ, బోధన్ రూరల్, రెంజల్ పోలీస్ స్టేషన్ శాఖ ఎడపల్లి పోలీస్ స్టేషన్ శాఖ . క్రికెట్ టోర్నమెంట్ లోయువకులుతదితరులు పాల్గొన్నారు.