ఎడపల్లి ప్రభుత్వ పాఠశాలలో వయోవృద్ధుల రక్షణ పై అవగాహన

ఎడపల్లి , నవంబర్ 21 ( లోకంతీరు ) : సీనియర్ సిటిజన్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఎడపల్లి ఆధ్వర్యంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, పోచారం లో నిర్వహించిన తల్లిదండ్రుల ,వయోవృద్దుల రక్షణ పోషణ సంక్షేమ చట్టం అంశంపై అవగాహన కార్యక్రమo విజయవంతంగా అయింది.పిల్లలు ఆసక్తిగా వింటూ చక్కగా స్పందించారు. పాఠశాల ఉపాధ్యాయ బృందం నిర్వహించిన ఇలాంటి కార్యక్రమాలు అభినందనీయమని సంతృప్తి వ్యక్తం చేసారు . కార్యక్రమంలో వక్తలుగా పి.విశ్వనాథం,రాష్ట్రకార్యదర్శి,పి.రాజలింగం,సంఘప్రధాన కార్యదర్శి, సత్యనారాయణ పాల్గొన్నారు. పాఠశాల ఉపాధ్యాయులు నరేష్కుమార్,.అనిత.సుజాత,సాయరెడ్డి,నరసింహ మూర్తి, సురేష్‌బాబు తదితరులు పాల్గొన్నారు.