దేశ కార్మిక వర్గానికి బ్లాక్ డేచీకటి దినం
– బి. మల్లేష్, తెలంగాణ ప్రగతిశీల బీడీ వర్కర్స్ యూనియన్ ( టి యు సి ఐ) జిల్లా ఉపాధ్యక్షులు

ఎడపల్లి, నవంబర్ 22 ( లోకంతీరు ) : దేశంలో కార్మిక వర్గం ఎన్నో పోరాటాలు మరెన్నో త్యాగాలతో సాధించుకున్న 29 చట్టాల స్థానంలో కేంద్రంలోని మోడీ ప్రభుత్వం నాలుగు లేబర్ కోడ్ (స్మృతు) లను శనివారం రోజు నుండి అమలు చేస్తామని ప్రకటించిందని అందుకే శనివారం దేశ కార్మిక వర్గానికి బ్లాక్ డే (చీకటి దినం) అని బి.మల్లేష్ మండిపడ్డారు. నిజామాబాద్ జిల్లా ఎడపల్లి మండలంమంగల్ పాడ్ గ్రామంలో బీడీ కార్మికుల తో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ 1990 లోనే నూతన పారిశ్రామిక విధానాలను తెచ్చినప్పటికీ వాటిని అమలు చేయుటకు నాటి పాలకులు సాహసించలేదని కానీ నేటి కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం బడా కార్పొరేట్లకు దేశ కార్మికుల శ్రమను మరింత దోచుకొనుటకే ఈ సంస్కరణలు ఉపయోగ పడతాయని మండిపడ్డారు. దేశంలో ఒక మహిళ అర్థరాత్రి ఒంటరిగా వెళ్ల గలిగినప్పుడే దేశానికి నిజమైన స్వాతంత్రం అని మహాత్మా గాంధీ చెప్పారని, కానీ నేడు మనదేశంలో పట్టపగలే మహిళలకు రక్షణ లేని పరిస్థితులలో ఉన్నామని ఇటువంటి పరిస్థితులలో మహిళలతో రాత్రి షిఫ్టులలో పని చేయుటకు చట్టాల సవరణ చేయడం సరికాదన్నారు. కంపెనీలలో పనిచేసే కార్మికులను ఎప్పుడైనా తొలగించే అధికారాన్ని యజమానులకు కట్టబెట్టే చట్టాలు కార్మికులకు పని భద్రత చట్టాలు ఎలా అవుతాయని ప్రశ్నించారు. కార్మికులకు కనీస వేతనాలు సంవత్సరాల తరబడి అమలు చేయడం లేదని కానీ నేడు ఈ చట్టాల సవరణ మూలంగా కనీస వేతనాలు తప్పనిసరి అని చెప్పడం విడ్డూరమని అందుకే ఇవి కార్మిక వర్గానికి నష్టకరమని వీటిని వెంటనే ఉపసంహరించుకోవాలని బి మల్లేష్ డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో జే. సవిత,డి. ప్రమీల, డి. సుగుణ, జే. అర్చన, ఎస్. పోసాని, ఎస్. వసంత, జె.లాస్య, డి.కవిత, పి. లతా, వి. లహరి, జె.మాధవి, బి. అనిత, పి. లక్ష్మి, పీ. కళావతి, ఎల్. పద్మ, జి. కళావతి, వి. స్వాతి, ఎస్. స్వప్న, కె. అనసూయ, జె.లావణ్య తదితరులు పాల్గొన్నారు.