ఎడపల్లి మండలంలో బోరు బావుల వద్ద వరి నాట్లు

ఎడపల్లి , అక్టోబర్ 23 ( లోకంతీరు ) : ఎడపల్లి మండలంలోని ఆయా గ్రామాల్లోనీ శివారులో రైతన్నలు వేసిన వరి ఫైరు నాటుకు (వేలాయే)వస్తుంది. మరో పది రోజుల్లో బోర్ బావుల వద్ద రైతులు నాట్లు వేసేందుకు ప్రణాళికను సిద్ధం చేసుకుంటున్నారు.వర్షాకాలంలో ప్రకృతి వైపరీత్యాల వల్ల కురిసిన భారీ వర్షాలకు చేతికొచ్చిన పంటలు తీవ్రంగా నష్టపోవడంతో రైతన్నలు, అనేక ఇబ్బందులతో పాటు తీవ్రంగా నష్టపోయిన విషయం అందరికీ తెలిసిందే,అందుకే ముందస్తుగా బోరు బావుల వద్ద నాట్లు వేస్తే పకృతి వైపరీత్యాలనుండి బయటపడే అవకాశం ఉండవచ్చని భావంతో ముందస్తుగా అక్టోబర్ మాసంలోనే పంట మడులను దుక్కిన తర్వాత నారుమడు లను సిద్ధం చేసుకున్నారు. నారు పోసి కాపాడుకుంటున్నారు చలి తీవ్రత గా ఉన్నప్పటికీ రైతులు అధైర్యపడకుండా ధైర్యంగా ఈసారి పంట దిగుబడుల వచ్చే విధంగావట్టదలతో ఉన్నట్టు తెలుస్తుంది.ఏదిఏమైనాయాసంగి పంట కొరకు రైతన్నలు నాటు వేసేందుకు సిద్ధమయ్యారు.మరో 10 రోజుల్లో బోరు బావుల వద్ద నాట్లు వేసేందుకు రైతన్నలు సిద్ధమవుతున్నారు.