Take a fresh look at your lifestyle.

గ్రామపంచాయతీ ఎన్నికలకు పటిష్టమైన ఏర్పాట్లు …..

0

గ్రామపంచాయతీ ఎన్నికలకు పటిష్టమైన ఏర్పాట్లు 

– శాంతియుత వాతావరణంలో ఎన్నికల జరిగేలా తగు చర్యలు తీసుకోవాలి

– పోలీస్ కమిషనర్ వెల్లడి

నిజామాబాద్, డిసెంబర్ 03 ( లోకంతీరు ) : నేడు నిజామాబాద్ పోలీస్ కమిషనరేటు పరిధిలోని ఆర్మూర్ డివిజన్ లో 3వ విడత నామినేషన్ల స్వీకరణ ప్రారంభం కావడం జరిగింది.ఈ సందర్బంగా  నిజామాబాద్ పోలీస్ కమిషనర్  పి.సాయి చైతన్య, ఐ.పి.యస్ ఆర్మూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని గోవింద్ పేట్ గ్రామంలోని గ్రామ పంచాయితీ కార్యాలయం మరియు ప్రాధమిక పాఠశాలను పర్యవేక్షించి అక్కడ ఎన్నికల సందర్బంగా తీసుకుంటున్న ఏర్పాట్లను క్షుణ్ణంగా పర్యవేక్షించారు. ఈ సదర్భంగా పోలీస్ కమిషనర్  మాట్లాడుతూ ఎన్నికల సందర్భంగా ఎటువంటి ఆరోపణలకు, అవాంఛనీయ ఘటనలకు ఆస్కారం లేకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఎన్నికల కమిషన్ నిబంధనలను అమలు చేస్తు, పోలింగ్ ను ప్రశాంతంగా నిర్వహించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. నిజామాబాద్, ఆర్మూర్, బోధన్ డివిజన్ పరిధిలోని అన్ని గ్రామ పంచాయితీలు వాటి ప్రకారం పటిష్టమైన బందోబస్తులు నిర్వహించడం జరుగుతుందని, పోలీస్ సిబ్బందికి నామినేషన్ సెంటర్ దగ్గరలో 100 మీ.ల లోపు నిషేధిత ఉత్తర్వులు అమలులో ఉంటాయని ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చూడాలని, ఎస్.ఎస్.టి మరియు ఎఫ్.ఎస్.టి ల ప్రకారం అన్ని మండలాల యందు పర్యవేక్షించడం జరుతున్నాయని, సమస్యాత్మకమైనని, అతి సమస్యాత్మకమైన ప్రాంతాలలో  బందోబస్తు ఏర్పాట్లు మరియు పెట్రోలింగ్ నిర్వహించడం జరుగుతుందని అన్నారు. ప్రజలందరూ ఎలప్పుడు పోలీసు అధికారులకు సహకరించాలని అన్నారు.ఈ కార్యక్రమంలో ఆర్మూర్ ఎ.సి.పి శ్రీ వెంకటేశ్వర్ రెడ్డి, ఆర్మూర్ ఎస్.హెచ్.ఓ శ్రీ సత్యనారాయణ గౌడ్ మరియు ఆర్.ఓ శ్రీ డి. సర్సయ్య ఎ.ఆర్.ఓ శ్రీ శ్రీనివాస్ గౌడ్, సెక్రెటరీ సుఖన్య. ప్రిన్సిపాల్ శ్రీమతి ఇందిరా మరియు సిబ్బంది పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.