రాష్ట్ర ప్రభుత్వ ముఖ్య సలహదారుకు సన్మానం

ఎడపల్లి , డిసెంబర్ 14 ( లోకంతీరు ) : ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డిని ఎడపల్లి గ్రామ ఉప సర్పంచ్. మచ్కూరి గంగాధర్ ఆదివారం ఎడపల్లి కాంగ్రెస్ పార్టీ మండల కోశాధికారి, పార్టీ సీనియర్ నాయకులు బొబ్బిలి శ్రీనివాస్ ఆధ్వర్యంలో రాష్ట్ర ప్రభుత్వ ముఖ్య సలహాదారులు పొద్దుటూరి సుదర్శన్ రెడ్డి ని సన్మానించి పూల బొక్కెను అందజేశారు. నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ముఖ్య సలహాదారులు పొద్దుటూరు సుదర్శన్ రెడ్డి నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఎడపల్లి ఉప సర్పంచ్ గా పరిచయమయ్యారు.కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి ఎడపల్లి ఉపసర్పంచ్ కావడం హర్ష నియమనీ పొద్దుటూరు సుదర్శన్ రెడ్డి అన్నారు. ఈ సందర్భంగా మచ్చుకూరి గంగాధర్ ను అభినందించారు. బొబ్బిలి శ్రీనివాస్ తో పాటు, ఎడపల్లి సహకార సంఘం డైరెక్టర్ ఎం.సురేష్, గ్రామ అధ్యక్షులురత్నకర్ రెడ్డి, మచ్ కూరీ కిరణ్, మోహన్, తదితరులు ఉన్నారు.