Take a fresh look at your lifestyle.

ఎక్సైజ్ సూపరింటెండెంట్ ఇంట్లో ఏసీబీ సోదాలు…..

0

ఎక్సైజ్ సూపరింటెండెంట్ ఇంట్లో ఏసీబీ సోదాలు..

– అరెస్ట్ చేసిన ఏసీబీ అధికారులు 

నిజామాబాద్, జూన్ 23 (లోకంతీరు న్యూస్ ) : నిజామాబాద్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ (Excise Superintendent) కొమ్మూరి మల్లారెడ్డిపై ఏసీబీ అక్రమాస్తుల కేసు నమోదు చేసింది. ఉదయం నుంచి మల్లారెడ్డి నివాసం ఉంటున్న నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని ఆయన నివాసంతో పాటు హైదరాబాద్, బంధువులు, ఆయన బినామీలకు చెందిన పది ప్రాంతాల్లో అధికారులు సోదాలు నిర్వహించారు. ఈ సందర్భంగా సుమారు రూ.3 కోట్ల విలువైన అక్రమాస్తులు గుర్తించారు. ప్రస్తుత మార్కెట్ ధర ప్రకారం వీటి విలువ చాలా ఎక్కువగా ఉంటుందని అంచనా వేస్తున్నారు. మల్లారెడ్డికి నాలుగు ఇళ్లు, ఒక వాణిజ్య సముదాయం, హైదరాబాద్, నిజామాబాద్ జిల్లాల్లో 8 ఓపెన్ ప్లాట్లు ఉన్నట్లు గుర్తించారు. పది ఎకరాల వ్యవసాయ భూమి కూడా ఉంది. ప్రస్తుతం ఆయన ఇంట్లో రూ.3.31 లక్షల నగదుతో పాటు బ్యాంకులో రూ.50 లక్షల డిపాజిట్లు ఉన్నట్లు గుర్తించారు. ఇంకా తనిఖీలు కొనసాగుతున్నాయి. మల్లారెడ్డిని అరెస్ట్ చేసిన ఏసీబీ అధికారులు.. సాయంత్రం నాంపల్లి కోర్టులో హాజరుపర్చి రిమాండ్ చేయబోతున్నారు. కాగా, ఎక్సైజ్ శాఖలో ఎస్పీ స్థాయి వ్యక్తి ఇంట్లో తాజా సోదాలు కలకలం రేపుతున్నాయి.

Leave A Reply

Your email address will not be published.