సి పి ఐ పార్టీ జయంతి ని సక్సెస్ చేయాలి

నిజామాబాద్ అర్బన్, డిసెంబర్ 22(లోకంతీరు ) : సమ సమాజ స్థాపన కోసం సిపిఐ పార్టీని ఏర్పాటు చేసి ఈనెల 26 తో 100 వ వసంతంలో అడుగెడుతున్న సందర్భంగా ఈ నెల 26 న నగరంలోని అంబేద్కర్ కాలనీలోని సిపిఐ పార్టీ కార్యాలయంలో ఘనంగా జండా ఆవిష్కరణ, ప్రదర్శన కార్యక్రమం నిర్వహిస్తుట్లు జరుగుతుం సీపీఐ నగర కార్యదర్శి వై. ఓమయ్య తెలిపారు. ఈ కార్యక్రమంలో నిజామాబాద్ నగర పరిధిలోని సిపిఐ పార్టీ శ్రేణులు పెద్ద సంఖ్యలో ఎర్ర చొక్కాలు, ధరించి హాజరు కావాలని అయన కోరారు. సిపిఐ పార్టీ నాయకత్వం ప్రధానంగా తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటాన్ని నడిపి పది లక్షల ఎకరాల భూమిని పంచడంతోపాటు నిజాం నవాబును ఈ ప్రాంతం నుండి తరిమి తెలంగాణ ప్రాంతాన్ని భారతదేశంలో విలీనం చేసిన చరిత్ర సిపిఐ కుందన్నారు. ప్రత్యేక తెలంగాణ ఆవిర్భావం కోసం సిపిఐ నాయకత్వం అవిశ్రాంత పోరాటం చేసిందనారు.ఈ
కార్యక్రమంలో సిపిఐ నగర నాయకులు పి .హనుమాన్లు, బి.అనిల్ ,కండ్లకోయ గంగాధర్, ఇమ్రాన్ అలీ, సాయన్న తదితరులు పాల్గొన్నారు.