Take a fresh look at your lifestyle.

సాలూర ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని సందర్శన …..

0

సాలూర ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని సందర్శన 

ఎడపల్లి, నవంబర్ 12 ( లోకంతీరు ) : సాలూర మండల ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆ శాఖ యూనిట్ అధికారి అక్తర్ఖాన్ బుధవారం సందర్శించారు. డెంగీ, మలేరియా.ఇతర వ్యాధుల గురించి వైద్యులు తీసుకోవలసిన జాగ్రత్తలపై ఆయన స్థానిక ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారి రాజ్ కుమార్ సలహాలు సూచన చేశారు. మండలంలోని హున్స గ్రామంలో ప్రత్యేకంగా వైద్యులతో పాటు ఆసుపత్రి సిబ్బంది ప్రజల ఆరోగ్య విషయాలను తెలుసుకొని పరీక్షలు నిర్వహించుకోవాల్సిన అవసరం ఉందని ఆయన అన్నారు. ప్రజలు ఆరోగ్యంగా ఉన్నప్పుడే వైద్యులకు మంచి పేరు వస్తుందని ఆయన డాక్టర్ రాజ్ కుమార్ తో అన్నారు. విధి నిర్వహణలో ఉన్న వైద్యులు ప్రజల ఆరోగ్య విషయాల పట్ల ప్రత్యేక జాగ్రత్త చర్యలు తీసుకోవాలని ఆయన తెలిపారు.ఆయన వెంట సాలూర ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్య అధికారి రాజ్ కుమార్ తదితరులు ఉన్నారు.

Leave A Reply

Your email address will not be published.