నెహ్రు నగర్ లో సర్పంచ్ పోటీకి నామినేషన్

ఎడపల్లి , నవంబర్ 28 ( లోకంతీరు ) : ఎడపల్లి మండలం నెహ్రూ నగర్ నామినేషన్ కేంద్రంలో శుక్రవారం బీసీ జనరల్ మహిళ సర్పంచ్ గా రావడంతో గ్రామానికి చెందిన ఫాతిమా బేగం సర్పంచ్ గా నామినేషన్ పత్రాలను సమర్పించారు. ఎన్నికల అధికారులు సర్పంచ్ నుండి నామినేషన్ పత్రాలను స్వీకరించారు. నామినేషన్ కేంద్రాల వద్ద పోలీసులు బందోబస్తు నిర్వహించారు . స్థానిక సంస్థలు ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించేందుకు గ్రామ ప్రజలు యువకులు మహిళలు సహకరించాలని పోలీస్ అధికారులు కోరారు. కార్యక్రమంలో సర్పంచ్ అభ్యర్థి ఫాతిమ బేగం, షేక్ అల్మాస్, ఇమ్రాన్ ఖాన్ షేక్ ఫిరోజ్, షేక్ గౌస్, తదితరులున్నారు. ఈ సందర్భంగా సర్పంచ్ అభ్యర్థి ఫాతిమా బేగం మాట్లాడారు. గ్రామ అభివృద్ధికి తన వంతు సహకారం ఉంటుందన్నారు. గ్రామ పెద్దలు గ్రామ యువకులు, మహిళలు ప్రతి ఒక్కరూ తనను ఆడబిడ్డగా భావించి తన గెలుపునకు మీ వంతు సహకారం అందించాలని ఆమె పేరుపేరునా కోరారు.