బోధన్ ఆర్టీసీ ఆధ్వర్యంలో గోవా స్పెషల్ టూర్
ఎడపల్లి , డిసెంబర్ 16 ( లోకంతీరు ) : బోధన్ బస్ డిపో ఆధ్వర్యంలో ఈనెల 24(బుధవారం)న ఉదయం 10 గంటలకు తుల్జాపూర్. పండరీపూర్. శికర్ శిగ్నాపూర్ మహాదేవ్. కొల్లాపూర్ మహాలక్ష్మి. దర్శనాలు చేసుకుని గోవా చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో మురుడేశ్వర్. పర్లి వైద్యనాథ్ జ్యోతిర్లింగం. అవండ నాగనాథ్. నాందేడ్ గురుద్వార్. తదితర పుణ్యక్షేత్రాల దర్శన యాత్రను ఏర్పాటు చేశారు ఈ యాత్ర28(ఆదివారం) బోధన్ చేరుకుంటుంది. ఒక్కొక్కరికి 4.700 చార్జ్ ఉంటుందని తెలిపారు పూర్తి వివరాల కోసం సంప్రదించవలసిన ఫోన్ నెంబర్( 6301415975) (7382844221 )ను సంప్రదించాలని ఆర్టీసీ అధికారులు తెలిపారు.