జిల్లా పరిషత్ హైస్కూల్ లో వంటగది పరిశీలన
– మాజీ జెడ్పీటీసీ రాజేశ్వరరావు

కామారెడ్డి జిల్లా ప్రతినిధి , ఫిబ్రవరి 21 ( లోకంతీరు ) : ఎంపీ బీబీ పాటిల్ నిధుల నుంచి లక్ష రూపాయలు మంజురయ్యాయని త్వరలో నిర్మాణం చేపడతామని మాజీ జెడ్పిటిసి పడిగెల రాజేశ్వరరావు అన్నారు కామారెడ్డి జిల్లా సదాశివనగర్ మండలం భూంపల్లి ఉన్నత పాఠశాలలో బుధవారం శిథిలమైన కిచెన్ షెడ్డు మాజీ జడ్పిటిసి రాజేశ్వరరావు, ఉపాధ్యాయుడు లోకేశ్వరరావు తో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయులు మాట్లాడుతూ శిథిలావస్థకు లో ఉన్న గదిలో వంటలు చేయవలసి వస్తుంది అన్నారు. దీన్ని దృష్టిలో పెట్టుకొని కిచెన్ షెడ్ ఎంపీ బీబీ పాటిల్ నిధుల నుంచి లక్ష రూపాయలు మంజూరయ్యాయని త్వరలో నిర్మాణం చేస్తామన్నారు. కిచెన్ షెడ్డు ముందు సీసీ చేయాలన్నారు. తప్పకుండా చేస్తామని మాజీ జెడ్పిటిసి హామీ ఇచ్చారు.అలాగే పాఠశాల ఆవరణ కూడా పరిశుభ్రంగా ఉంచాలని కోరారు. పాఠశాల కి స్వచ్ఛంద సంస్థల ద్వారా సాయం అందజేయడానికి సిద్ధంగా ఉన్నామన్నారు. అలాగే మౌలిక వసతుల కోసం ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని పాఠశాల ఆవరణలోని మట్టిని రాళ్ళను వెంటనే తొలగించేటట్లు చూడాలని హెచ్ఎం కు సూచించారు. విద్యార్థుల భవిష్యత్తు సంకల్పించడానికి కృషి చేయాలని తాము కూడా సహకరిస్తామన్నారు.